Tollywood Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్- మాజీ బ్యూటీ కాజోల్ వివాహబంధానికి నేటితో 28 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, తమ పెళ్లిరోజు సందర్భంగా కాజోల్ ప్రత్యేక ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో అజయ్ – కాజోల్ మధ్య ప్రేమ బాగా ఎలివేట్ అయ్యింది.
అందాల తార లక్ష్మిరాయ్ మొత్తానికి తనలోని గ్లామర్ ను బాగా ఎలివేట్ అయ్యేలా ఒక స్టిల్ ఇచ్చింది. మొత్తమ్మీద ఎరుపు రంగు దుస్తుల్లో అందరినీ ఆకట్టుకునేలా ఉంది లక్ష్మిరాయ్. పైగా తన ఫొటోని షేర్ చేస్తూ ‘రౌడీబేబీ, “కమింగ్ సూన్’ అనే హ్యాష్ ట్యాగ్ లను యాడ్ చేసింది.
ఇషాచావ్లా తనకెంతో ఇష్టమైన శ్రీదేవి ఫొటోల్ని పోస్ట్ చేసి నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
అలాగే చందమామ కాజల్ అగర్వాల్, డస్కీ బ్యూటీ విద్యా బాలన్, అమృత అయ్యర్ తదితరులు శారీలో కనిపించి అలరించారు.
నమ్రతా శిరోద్కర్ తన ముద్దుల తనయుడు గౌతమ్, తనయ సితార కుక్కతో ఆడుకుంటూ ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం