Ukraine-Russia War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. సోమవారం రెండు దేశాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో మళ్లీ యుద్ధమే శరణ్యమని తెలుస్తోంది. దీంతో ఇరుదేశాలకు భారీ నష్టమే జరగనుంది. కానీ తమ పంతాలు మాత్రం వీడటం లేదు. ఫలితంగా ఉక్రెయిన్ కు ప్రాణనష్టం కలగనుంది. ఇప్పటికే చాలా మంది దేశం విడిచి వలస వెళ్లారు. కానీ రష్యా మాత్రం యుద్ధం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఆపాలని ప్రపంచ దేశాలు చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేస్తోంది.
రష్యా చర్యలను అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం వద్దని వారిస్తున్నా రష్యా మాత్రం లెక్క చేయడం లేదు. అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్లను సైతం పట్టించుకోవడం లేదు. రష్యా దుందుడుకు చర్యలను ముక్తకంఠంతో ప్రపంచ దేశాలన్ని ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ ను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దని వారిస్తున్నాయి. కానీ రష్యా మాత్రం తనకేమీ సంబంధం లేదని చెబుతోంది.
Also Read: అమెరికా, యూరప్ మోసం.. నమ్మి ‘ఉక్రెయిన్’ నిండా మునిగిందా?
రష్యా దూకుడును తగ్గించాలని ఐక్య రాజ్యసమితి సైతం సూచిస్తోంది. యుద్ధ భయంపై సర్వప్రతినిధి సభ సైతం సమావేశమై రష్యా చర్యలను ఆక్షేపించింది. భద్రతా మండలిలో వీటో అధికారం ప్రయోగిస్తే రష్యాకున్న అధికారంతో తీర్మానం వీగిపోయేలా చేసింది. అత్యవసర పరిస్థితిలో సర్వప్రతినిది సభ సమావేశం అయి రష్యా యుద్ధం ఆపేయాలని తేల్చింది. కానీ రష్యా మాత్రం ఎవరు చెప్పినా వినేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
యుద్ధం మంచిది కాదని అగ్ర రాజ్యం అమెరికా సైతం రష్యాకు హితవు పలుకుతోంది. రష్యా మాత్రం దాని ఆదేశాలు సైతం పక్కన పెడుతోంది. యుద్ధమే మాకు తక్షణ అవసరం అని చెబుతూ ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాంబులతో భయపెడుతోంది. ఉక్రెయిన్ ను అన్ని దారుల్లో అలజడి కలిగిస్తోంది. రెండో దఫా కూడా చర్చలు ఉంటాయని తెలుస్తున్నా సఫలం కావాలని ఉక్రెయిన్ భావిస్తున్నా రష్యా మాత్రం విఫలం కావాలనే చూస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం తతంగానికి రష్యానే కారణంగా చెబుతున్నారు.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!