https://oktelugu.com/

Bigg Boss Non Stop: సిగ‌రెట్ తాగుతూ తేజ‌స్వి, ముమైత్ అరాచ‌కం.. బ్యాంకాక్ బీచ్‌లో అలా అంటూ..!

Bigg Boss Non Stop: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉన్న బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సారి సరికొత్తగా ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారమవుతోంది. బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్టుకోవడాలు, లవ్ ట్రాక్ లకు పెట్టింది పేరు. ఇప్పటి జనాలకు వీటితోనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తోంది ఈ షో. అయితే ఈ సారి గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని కొత్త టాస్క్ ల‌తో ముందుకు వ‌స్తోంది. ఈసారి ఓటు […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 1, 2022 / 11:19 AM IST
    Follow us on

    Bigg Boss Non Stop: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉన్న బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సారి సరికొత్తగా ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారమవుతోంది. బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్టుకోవడాలు, లవ్ ట్రాక్ లకు పెట్టింది పేరు. ఇప్పటి జనాలకు వీటితోనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తోంది ఈ షో. అయితే ఈ సారి గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని కొత్త టాస్క్ ల‌తో ముందుకు వ‌స్తోంది.

    tejaswi

    ఈసారి ఓటు వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ షోలో గతంలో పాల్గొన్న ముమైత్ ఖాన్, తేజస్వి, సరయు, అషురెడ్డి, శ్రీ రాపాక, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, యాంకర్ శివ లాంటి వారు ఉండడంతో బోల్డ్ కంటెంట్ కు కొదవ లేకుండా పోయింది. ఇక బిగ్ బాస్ 3 లో పాల్గొన్న తేజస్వి అప్పుడు ట్రోఫీ కొట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ కొన్నికొన్ని మిస్టేక్స్‌ వల్ల ఎలిమినేట్ అయిపోయింది.

    Also Read: భోళా లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్ !

    అయితే ఆ తర్వాత సినిమాల్లో వరుస ఛాన్సులు దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ షో లో వస్తూనే తన ప్రతాపం చూపిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రసారమైన షోలో తేజస్వి సిగరెట్ తాగుతూ రచ్చ రచ్చ చేసింది. హౌస్ లోని సిగరెట్ జోన్ లోకి వెళ్లి తాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చుని చేతిలో సిగరెట్‌ పట్టుకొని దమ్ము లాగుతుంది. ఇదే సమయంలో ఎదురుగా ఉన్న ముమైత్ ఖాన్ తో మాట్లాడుతూ బోల్డ్ కంటెంట్ ను ఇచ్చింది.

    mumaith khan

    సిగరెట్ తాగుతూ బ్యాంకాక్ బీచ్ లో అంటూ ఏదో బోల్డ్ మాటలు చెబుతోంది. ఇంతలోనే బిగ్ బాస్ ఏవో బీప్స్ సౌండ్స్ వేసి వారిని అలర్ట్ చేశాడు. అయినా సరే 50 ఏళ్ల వయసులో అంటూ మరింత మసాలాను కలిపేసింది. ఇక ముమైత్ ఖాన్ కూడా తేజస్వి తో చేరిపోయి సిగరెట్ దమ్ము లాగిస్తోంది. వీరిద్దరూ కలిసి సిగరెట్ తాగుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ కంటెంట్‌ను కావాల్సినంత ఇచ్చేశారు. మొదటిరోజే వీరు ఇంత రచ్చ చేశారంటే ఇంక ముందు ఇంకెంత చేస్తారు అని అనుకుంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.

    Also Read: పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే!

    Tags