YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పట్లో తేలడం లేదు. రోజుకో రకంగా తిరుగుతూ పరిష్కారం కాకుండా సాగుతూనే ఉంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారిస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో విధంగా కేసు మారుతోంది. దీంతో సీబీఐ సైతం ఎటూ తేల్చుకోలేకపోతోంది. వివేకా హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై అనుమానాలు ఇంకా వీడటం లేదు.
ఇప్పటికే పలు మలుపులు తిరుగుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వారి పేర్లు బయటకు వస్తున్నా వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం వారిపై ఎఫ్ ఐఆర్ సైతం నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.
Also Read: సంజయ్ రెండో విడత పాదయాత్ర ఆ రోజునుంచే.. చాలా పెద్ద ప్లాన్ వేశాడుగా
మరోవైపు వైఎస్ వివేకా కూతురు సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వారి వాంగ్మూలం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. కేసు దర్యాప్తులో సీబీఐ పలు కోణాల్లో విచారిస్తున్నా కొలిక్కి రావడం లేదు. ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. దీంతో సునీత చెప్పిన విషయాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వివేకా హత్య కేసులో సీఎం జగన్ హస్తం ఉన్నట్లు ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. దీంతో కేసు ఎటు వైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే నిందితులుగా అనుమానిస్తున్న వారందరు వైఎస్ కుటుంబీకులే కావడంతో ఈ అనుమానాలకు ఆజ్యం పోసినట్లవుతోంది.
ఎన్నికల కంటే ముందే వివేకా హత్యలో నిజాలు తెలిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యే వారు కాదని సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చెప్పడం పలు సంశయాలకు బీజం వేస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా గెలిచే వారు కాదని చెబుతున్నారు. దీంతో వివేకా హత్య కేసులో నిందితులుగా పేర్కొన్న వారి గురించి సునీత ఆమె భర్త వివరాలు వెల్లడించడంతో కేసు ఇంకా ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు
మొత్తానికి వివేకా కేసులో తవ్విన కొద్దీ నిజాలు దొరుకుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ కేసు ఎలా దర్యాప్తు చేయాలని తల పట్టుకుంటుంటే కేసు చిత్రమైన రకాలుగా మలుపులు తిరుగుతూ సినిమా కథనంలా అనిపిస్తోంది. దీంతో సీబీఐ ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచనలో పడుతోంది. సునీత మాత్రం అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలపై కేసులునమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాల కారణంగా వివేకా హత్య కేసులో నిజానిజాలు బయటపడాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇంకా ఈ కేసులో ఎవరెవరున్నారనే దానిపై స్పష్టత రావడం లేదు. కేసు పూర్తిగా పరిష్కారం కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనని తెలుస్తోంది.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!