Maharashtra Politics: మహారాష్ట్రలో బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీస్తుందా? శివసేనలో విభేదాలను కొలిక్కి తెచ్చే ప్రయత్నిస్తోందా? ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి ముర్ముకు ఉద్దవ్ మద్దతు ప్రకటించడంతో మొత్తబడిందా? ఉద్దవ్, ఏక్ నాథ్ ను ఒకే గూటికి తేవడానికి నిర్ణయించుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శివసేన కీలక నేత ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఉద్దవ్ ను వ్యతిరేకిస్తూ ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక బీజేపీ ఉందన్నది బహిరంగ రహస్యం. మహారాష్ట్ర పీఠం పై కన్నేసిన బీజేపీ శివసేనను నిలువునా చీల్చిందన్న అపవాదును అయితే మూటగట్టుకుంది. ఆవిర్భావం నుంచి సుదీర్ఘ కాలం తనతో ప్రయాణించిన శివసేన అధికారం కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. అటు పార్టీలో మెజార్టీవర్గాలు సైతం నిర్ణయాన్ని తప్పుపట్టాయి. వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని గమనించిన కషాయదళం ఏక్ నాథ్ షిండే రూపంలో అరుదైన అవకాశం కనిపించింది. ఆయన్ను ప్రోత్సహిస్తూ ఉద్దవ్ పై తిరుగుబాటును ప్రోత్సహించింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ షిండే గ్రూపునకు చేర్చడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. అటు ఉద్దవ్ ప్రభుత్వం అధికారానికి దూరమైంది. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా ఏక్ నాథ్ షిండేను మహారాష్ట్ర పీఠంపై కూర్చొబెట్టింది. పక్కన రిమోట్ విధానంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మెజార్టీ మంత్రులను మాత్రం బీజేపీ తీసుకుంది. అయితే బీజేపీ అనుకున్నది మాత్రం సాధించుకుంది. అయితే క్షేత్రస్థాయిలో శివసేన కింది స్థాయి శ్రేణుల్లో మాత్రం ఉద్దవ్ పై సానుకూలత ఉంది.కానీ ఆయన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలవడం మాత్రం ఇష్టం లేదు. అయితే ఇదే విషయాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం ఉద్ధవ్ ఉంటేనే శివసేన మనుగడ అని.. లేకుంటే కష్టమని గుర్తించింది. దీంతో ఉద్దవ్ ను దగ్గర చేసుకునేందుకు నిర్ణయించింది.

అపవాదు నుంచి తప్పించుకునేందుకు..
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా విస్తరించాలన్న బలమైన కోరిక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ద్వయంలో కనిపిస్తోంది. ఇందుకుగాను వారు రెండు ఫార్మూలాలను అనుసరిస్తున్నారు. ఒకటి నేరుగా అధికారంలోకి రావడం, రెండోది ప్రాంతీయ పార్టీల సాయంతో విస్తరించడం. కానీ ఉత్తరాధి రాష్ట్రాల్లో ఈ పాచిక పారినా.. దక్షిణాది విషయానికి వచ్చేసరికి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. అయితే మహారాష్ట్ర విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఒక సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకొని మహారాష్ట్రలో పెద్ద అగాధాన్ని సృష్టించగలిగారు. అనుకున్నది సాధించగలిగారు.
Also Read: KCR vs Modi: మోడీపై పగ పెంచుకుంటున్న కేసీఆర్..
కానీ ఓ పార్టీని నిర్వీర్యం చేశారన్న అపవాదును అయితే మూటగట్టుకున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలో హిందూత్వ అజెండాగా ఆవిర్భవించిన శివసేన పార్టీలో చీలిక తేవడం ద్వారా హిందువుల్లోని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. దీనిని గుర్తించిన బీజేపీ పెద్దలు ఉద్దవ్ ను దగ్గరకు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారని రాజకీయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తమను విభేదించి రాజకీయ వైరుధ్యం కలిగిన పార్టీలతో కలిసి వెళ్లారన్న కోపం తప్ప మాకు శివసేనను నిర్వీర్యం చేయాలన్న ఆలోచన లేదని చెప్పేందుకు ఉద్దవ్ ను దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎంపీల నుంచి ఒత్తిడి…
ఇప్పటికే ఎమ్మెల్యేలు దూరమై సీఎం పదవి కోల్పోయిన ఉద్దవ్ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే తన వెంట ఉన్న ఎంపీలు మాత్రం చేజారకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఎంపీలపై బీజేపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉంది. ఎన్సీపీ, కాంగ్రస్ తో ఏర్పడిన మహా కూటమి అసహజ సిద్ధమైనదని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. అందుకే బీజేపీతో తిరిగి కలిసిపోవడం ఉత్తమని అధినేత ఉద్దవ్ కు సలహా ఇస్తున్నారు. అటు బీజేపీ కూడా ఉద్దవ్ నేతృత్వంలోని శివసేనను కలుపుకు పోయేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల రూపంలో ఇరు పార్టీలు కలిసేందుకు ఒక అవకాశం వచ్చింది. దీంతో ఉద్దవ్ ఎన్డీఏ మద్దతు అభ్యర్థి ద్రౌపది ముర్మకు మద్దతు ప్రకటించారు. అయితే కేవలం గిరిజన మహిళ అన్న ఉద్దేశ్యంతోనే మద్దతు తెలిపామని.. బీజేపీకి దగ్గరైనట్టు కాదని ఉద్దవ్ చెబుతున్నారు. కానీ తెర వెనుక ఉద్దవ్, ఏక్ నాథ్ షిండేలను దగ్గర చేసేందుకు బీజేపీ మధ్యవర్తిత్వం నడుపుతుందన్న టాక్ మాత్రం నడుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇరువురు నేతలు సమావేశమయ్యే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
Also Read:Bunny Vasu : నిర్మాత , జనసేన నేత బన్నీ వాసు కి తృటిలో తప్పిన ప్రమాదం
[…] […]