KCR vs Modi: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మధ్య వైరం పెరిగిపోతోంది. ఇద్దరి మధ్య దూరం ఎక్కువవుతోంది. రాజకీయంగా ఉండాల్సిన ద్వేషం కాస్త వ్యక్తిగత కోపంగా మారుతోంది. దీంతో అధికార కార్యక్రమాలకు ప్రధాని హాజరైనా పట్టించుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై కోపం పెంచుకుని కేసీఆర్ సాధించేదేమిటి? శతృత్వం తప్ప. వచ్చే నిధులు ఆగిపోయాయి. ఫలితంగా సంక్షేమ పథకాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయనకే నష్టం కలిగే సూచనలున్నా పట్టించుకోవడం లేదు.
ప్రధాని దాదాపు మూడుసార్లు రాజధాని పర్యటనకు వచ్చిన ఏవో కారణాలు చూపుతూ స్వాగతం పలికేందుకు వెళ్లలేదు. ప్రొటోకాల్ పాటించడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో కోపం రాదా? ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇలా వ్యక్తిగతంగా దురుద్దేశాలు ఆపాదిస్తూ కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. ఈ క్రమంలో గతంలో గవర్నర్ తమిళిసై ని కూడా పక్కన పెట్టేయడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉపన్యాసం తప్పనిసరి. కానీ ఆ సంప్రదాయానికి కూడా టాటా చెప్పేశారు.
Also Read: Jansena Chief Pawan Kalyan: వైసీపీ గెలిచే ఛాన్స్ ఇవ్వం.. .జనసేనాని పవన్ హాట్ హాట్ కామెంట్లు..
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన విందుకు టీఆర్ఎస్ పార్టీ తప్ప అందరు హాజరు కావడం తెలిసిందే. ఇలా వ్యక్తిగత ద్వేషాలతో కేసీఆర్ ఏం సాధిస్తారు? ఏకాకిగా మారడం తప్ప ఆయన వల్ల కేంద్రానికి ఒరిగేమీ ఉండదు. ఎప్పటికైనా కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది కానీ రాష్ట్రం మీద కేంద్రం ఆధారపడదనే విషయం కేసీఆర్ కు తెలియదా? ఇలా పిచ్చి చేష్టలతో పిల్లవాడి మాదిరి ప్రవర్తించడం వివాదాలకే కేంద్ర బిందువుగా మారుతున్నారు.
మొదటి సారి గెలిచినప్పుడు మోడీతో ఉన్న సాన్నిహిత్యంతోనే పనులు చేసుకోగలిగారు. ప్రధానితో ఉన్న సంబంధాలతోనే రెండో సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి లబ్ధిపొందిన విషయం కూడా మరిచారు. నాడు శ్రీకృష్ణుడుగా కనిపించిన ప్రధాని ఇప్పుడు ఎందుకు నికృష్టుడుగా కనిపిస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికలో కేసీఆర్ ను ఓడించిన నాటి నుంచే బీజేపీపై ఆగ్రహం పెంచుకుని అడుగడుగునా కేంద్రాన్ని నిలదీయాలని చూస్తున్నారు. కానీ సీఎం తో జరిగిపోయే ప్రమాదమేదీ ఉండదని తెలుసుకోలేక పోవడం ఆయన అమాయకత్వానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఏదిఏమైనా కేసీఆర్ వైఖరితో శత్రుత్వం పెంచుకుంటున్నారు కానీ మిత్రుత్వం కాదనే విషయం గ్రహించుకుంటే మంచిదని బీజేపీ నేతలు సూచిస్తున్నారు.
సీఎం కేసీఆర్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. బీజేపీపై ఉన్న కోపంతోనే ప్రధానిపై కసి పెంచుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తన స్థాయిని మరిచిపోతున్నారు. దేశానికి ప్రధానిగా ఉండే వ్యక్తికి ఎన్ని సమస్యలుంటాయో తెలియవా? ఒక రాష్ట్రాన్నే చక్కదిద్దలేని వాడు కేంద్రంలో ఏం చేస్తాడో అని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ తీరు చర్చనీయాంశంగా మారుతోంది. భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
Also Read:Bunny Vasu : నిర్మాత , జనసేన నేత బన్నీ వాసు కి తృటిలో తప్పిన ప్రమాదం