లాక్డౌన్ కారణంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో దేవాదాయ శాఖ వేలకోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో దేవాలయ సిబ్బంది, కార్మికులకు జీతాలిచ్చే పరిస్థితుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దేవాయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వ్యాపారులు భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో తిరిగి దేవాలయాలు తెరుచుకోనుండటంతో ఆయా దేవాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిచ్చేందుకు సన్నహాలు చేస్తుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొందరిని శ్రీవారి దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయినట్లు సమాచారం.
శ్రీవారి దర్శనానికి ప్రతీరోజు 14గంటలపాటు భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు 500మంది మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి మూడురోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతి ఇవ్వనున్నారు. తర్వాత 15రోజులపాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. టీటీడీ నిర్ణయంతో రోజుకు 7వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తొలిగా మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు టికెట్లను టీటీడీ విక్రయించనుంది. ఈమేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అన్నిరకాల సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ttd making arrangements for lord balaji darshan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com