Homeజాతీయ వార్తలుTrump and Zelensky : ప్రెస్‌మీట్‌లో ట్రంప్, జెలన్‌స్కీ ఫైట్‌.. తల పట్టుకున్న ఉక్రెయిన్‌ రాయబారి.....

Trump and Zelensky : ప్రెస్‌మీట్‌లో ట్రంప్, జెలన్‌స్కీ ఫైట్‌.. తల పట్టుకున్న ఉక్రెయిన్‌ రాయబారి.. వీడియో వైరల్‌!

Trump and Zelensky : రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆపాలని కోరారు. అయితే నాటో దేశాలతో ఉక్రెయిన్‌ కలిసి ఉండడం ఇష్టంలేని పుతిన్‌ తన నిర్ణయం స్పష్టంగా చెప్పాడు. దీంతో ట్రంప్‌.. ఇటువైపు నుంచి నరుక్కురావాలనుకన్నారు. ఈమేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీని చర్చలకు పిలిచారు. ఈమేరకు జెలన్‌స్కీ అమెరికాకు వచ్చారు. వైట్‌హౌస్‌లో ఇద్దరు నేతలు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతోపాటు ఉక్రెయిన్‌లోని ఖనిజాల తవ్వకంపై ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరిపారు. అయితే శాంతి చర్చలు కాస్త రసాభాసగా మారాయి. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలన్‌స్కీ వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోయారు. అనంతరం మీడియా ఎదుట ఇద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. దీంతో ఉక్రెయిన్‌ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Also Read : ట్రంప్‌తో సమావేశం.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ విరమణపై చర్చ..రాజీ లేదన్న జెలన్‌స్కీ

సజావుగా మొదలై.. వాగ్వాదానికి దారితీసి..
ట్రంప్, జెలన్‌స్కీ(zelansky) మధ్య చర్చలు మొదట శాంతియుతంగా, సజావుగా ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్‌ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్‌ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరు దేశాల రాయబారులు అక్కడే ఉన్నారు. ట్రంప్‌ మాటలు, జెలన్‌స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్‌(Ucrain) రాయబారి ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. ఇలా జరుగుతుంది ఏంటి దేవుడా అన్నట్లు తల పట్టుకున్నారు. ఆమె హావభావాలు నెట్టింటోఓ్ల వైరల్‌ అవుతున్నాయి.

యుద్ధం ఆపడానికి..
రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదర్చడానికి, దానికి బదులు ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకే జెలన్‌స్కీ అమెరికా వచ్చారు. భవిష్యత్‌లో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. అనంతరం దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ మాట్లాడుతూ ఇలాంటి ఘరషణ ఇరుపక్షాలకు మంచిది కాదని పేర్కొన్నారు.
ట్రంప్‌ బెదిరింపులు..

Also Read :
అధికారంలోకి వచ్చిన నెలలో 20 వేల మందికిపైగా అరెస్ట్‌.. అమెరికా జైళ్లలో అక్రమ వలసదారులు!

ఇదిలా ఉంటే చర్చల సమయంలో ట్రంప్‌ జెలన్‌స్కీని బెదిరించారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా మద్దతు లేకుండా రెండు వారాల్లోనే పరాజయం పాలవుతుందని, దేశం నాశనమైపోతుందని బెదిరించినట్లు సమాచారం.
దీనికి ప్రతిస్పందనగా, జెలెన్‌స్కీ గట్టిగా ఎదురు తిరిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రాజీపడే ప్రసక్తే లేదని, ఉక్రెయిన్‌ ఈ యుద్ధంలో గెలవకపోవచ్చని ట్రంప్‌ చెప్పినా, అమెరికా సహాయం లేకుండా కూడా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ వాగ్వాదం మీడియా ముందు బహిరంగంగా జరగడంతో వైట్‌ హౌస్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాధినేతలు ప్లాన్‌ చేసిన సంయుక్త పత్రికా సమావేశం రద్దు చేశారు. ఈ ఉదంతం అమెరికా–ఉక్రెయిన్‌ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫాక్స్‌ న్యూస్‌ వంటి మీడియా సంస్థలు ఈ ఘటన రెండు దేశాలకూ మంచిది కాదని అభిప్రాయపడ్డాయి. ఈ వివాదం ప్రపంచ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది, ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంలో ట్రంప్‌ వైఖరి గురించి ఊహాగానాలు తలెత్తాయి.

RELATED ARTICLES

Most Popular