అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెల్సిందే. నవంబర్లోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక లాంఛనంగా ముగియాల్సిన ఉండనే ట్రంప్ పంతం కారణంగా అదికాస్తా ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పంతంవీడి అధికార బదిలీకి అంగీకరించడంతో బెడైన్ కు లైన్ క్లియర్ అయింది.
Also Read: ట్రంప్ ప్రతిపక్ష పాత్రతో మరోసారి అధికారం ఛాన్స్!
నవంబర్లలోనే అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాగా డోనాల్డ్ ట్రంప్ కు 232ఎలక్ట్రోరల్ ఓట్లు.. డెమెక్రాటిక్ అభ్యర్థి బెడైన్ కు 306ఓట్లు వచ్చాయి. దీంతో బెడైన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే అనుకున్నారంతా. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించకపోవడంతో నవంబర్ చివరి వారం కూడా అమెరికా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కాలేదు.
తాజాగా డోనాల్డ్ ట్రంప్ అధికార బదిలీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పరోక్షంగా ట్రంప్ తన ఓటమిని అంగీకరిస్తూనే న్యాయపోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార బదిలీలో కీలక పాత్ర పోషిస్తున్న జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ) విభాగం చీఫ్ ఎమిలీ మర్ఫీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
Also Read: చలికాలంలో ఎన్నికల వేడి
‘మనదేశం పట్ల విశ్వాసం.. నిబద్దత కలిగిన ఎమిలీ మర్ఫీకి కృతజ్ఞతలు.. గత కొన్నిరోజులుగా ఆమెపై కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారు.. దీనిని కొనసాగించాలని నేను అనుకోవడం లేదు.. దేశ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని అధికార బదిలీ చేపట్టాలని ఎమిలీని కోరుతున్నా.. న్యాయ పోరాటం మాత్రం కొనసాగుతుందని’ ట్రంప్ స్పష్టం చేశారు. కాగా ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ స్వాగతించారు.
ట్రంప్ నిర్ణయంపై బైడెన్ హర్షం వ్యక్తం చేస్తూ అధికార మార్పిడికి ఇదొక ముందడుగు అని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న కరోనా పరిస్థితులు.. ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టడంతోపాటు అనేక సమస్యలకు పరిష్కారం కనుగోనేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. అధికార బదిలీకి మార్గం సుగమం కావడంతో బైడెన్ 15మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు