సినిమా సడలింపులు సరే.. టికెట్ రేటు తగ్గించరా.?

తెలుగు సినిమా పరిశ్రమకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఎంతో కాలంగా మూతబడి ఉన్న థియేటర్లలో పనిచేసే కార్మికులు, సినిమా షూటింగ్ లో పాల్గొనే సిబ్బందికి కొన్ని సడలింపులు ఇచ్చారు. అంతేకాకుండా సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా జీఎస్టీ విషయంలో రీయంబర్స్ మెంట్ ఉంటుందంటూ చెప్పడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యపీగా ఉంది. అయితే ఈ ఫలాలు కిందిస్థాయి కార్మికుడి చేరితే బాగుంటుంది కానీ.. వరదసాయంలా మధ్యలోనే మాయం అయితే మాత్రం ఆశలు అడియాశలయ్యే ప్రమాదం ఉంది. Also […]

Written By: NARESH, Updated On : November 24, 2020 11:11 am
Follow us on

తెలుగు సినిమా పరిశ్రమకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఎంతో కాలంగా మూతబడి ఉన్న థియేటర్లలో పనిచేసే కార్మికులు, సినిమా షూటింగ్ లో పాల్గొనే సిబ్బందికి కొన్ని సడలింపులు ఇచ్చారు. అంతేకాకుండా సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా జీఎస్టీ విషయంలో రీయంబర్స్ మెంట్ ఉంటుందంటూ చెప్పడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యపీగా ఉంది. అయితే ఈ ఫలాలు కిందిస్థాయి కార్మికుడి చేరితే బాగుంటుంది కానీ.. వరదసాయంలా మధ్యలోనే మాయం అయితే మాత్రం ఆశలు అడియాశలయ్యే ప్రమాదం ఉంది.

Also Read: ‘అంటే సుందరానికి’పై నాని హడావుడి ఎందుకు?

అయితే ఇక్కడ మరో విషయమేమిటంటే సినిమా పరిశ్రమకు సడలింపులు ఇచ్చిన కేసీఆర్ ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి మాత్రం మొండి చేయి చూపించారు. ఎంతో కాలంగా సినిమాలకు దూరమైన వారు ఇకపై సినిమా చూసేందుకు ఇష్టపడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సినిమా థియేటర్లలో రేట్లు సామాన్యుడికి అందనంత రేంజ్ లో ఉన్నాయి. మాములు థియేటర్లలో రూ.100 నుంచి రూ.200 వరకు ధరను నిర్ణయించారు. ఇక మల్టీఫ్లెక్స్ లో చెప్పలేని రేట్లు ఉన్నాయి. మల్టీఫ్లెక్స్ లలో రూ. 150 నుంచి 500 వరకు ఉన్నాయి.

ఒక కుటుంబం మల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలంటే కనీసం రూ. వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చవుతుంది. దీంతో అప్పుడప్పుడు సినిమా చూసేవారు ఈ రేట్లకు భయపడి ఏ అమెజానో, లేక ఇతర మార్గాల ద్వారా సినిమాలు చూసి వినోదం పొందుతున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రాక కొన్ని సినిమా టాకీసులు మూతబడ్డ సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కరోనా కాలంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న కొన్ని సినిమా థియేటర్ల మళ్లీ తెరుచుకుంటాయన్న ఆశలు లేవు. ఒకవేళ తెరుచుకున్నా థియేటర్ సిబ్బందికి వెచ్చించే వేతనాలు, ఇతర ఖర్చులు సరిపోవు.

Also Read: ‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా?

ఈ నేపథ్యంలో ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించే ప్రణాళికపై ఆలోచిస్తే బాగుంటుందని పలువురు థియేటర్ల యజమానులు వాపోతున్నారు. సినిమా పరిశ్రమకు కొన్ని సడలింపులపై హర్షం వ్యక్తం చేసినా టికెట్ ధర విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలు పెడితే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ టికెట్ ధర విషయంలో యజమానులకు వదిలేశారు. దీంతో ఆర్థికంగా బాగున్న థియేటర్లు తక్కువ ధరను నిర్ణయిస్తే మాములు థియేటర్లకు ప్రేక్షకులు రాలేరు. దీంతో మొత్తం థియేటర్లకు ఒకే టికెట్ ధరను నిర్ణయించాలని కోరుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్