టీఆర్ఎస్ టార్గెట్: బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

దుబ్బాక ఉప పోరు హోరాహోరీగా సాగింది. మరో మూడు రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది తామేనన్న ధీమాలో బీజేపీ క్యాడర్‌‌ ఉంది. దీంతో ఇప్పుడు గ్రేటర్‌‌పై నజర్‌‌ పెట్టింది. ఇదే క్రమంలో టీఆర్‌‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నేతలపై దృష్టి పెట్టింది. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఇప్పటికే అంతర్గతంగా  ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించింది. గతంలో అధికార పార్టీలోకి చేరిన చాలా […]

Written By: NARESH, Updated On : November 7, 2020 11:25 am
Follow us on

దుబ్బాక ఉప పోరు హోరాహోరీగా సాగింది. మరో మూడు రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది తామేనన్న ధీమాలో బీజేపీ క్యాడర్‌‌ ఉంది. దీంతో ఇప్పుడు గ్రేటర్‌‌పై నజర్‌‌ పెట్టింది. ఇదే క్రమంలో టీఆర్‌‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నేతలపై దృష్టి పెట్టింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఇప్పటికే అంతర్గతంగా  ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించింది. గతంలో అధికార పార్టీలోకి చేరిన చాలా మంది నేతలు.. ఇప్పుడు ఆ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని మదనపడుతున్నారు. ఇలాంటి అసంతృప్తుల జాబితాను బీజేపీ సిద్ధం చేసుకుంది. అలాగే.. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయో జాబితా తయారుచేస్తున్నారు. వారందరినీ గుర్తించి.. ఇప్పుడు వారితో చర్చలు ప్రారంభించింది. అందులో భాగంగానే.. బీజేపీ ప్రయత్నాలు ఫలించి మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కమలం గూటికి చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

Also Read: పార్టీ మార్పుపై స్పందించిన విజయశాంతి

పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌ తరఫున కృష్ణారెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డిపై గెలిచారు. ఆమె టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి కూడా పొందారు. అప్పట్నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో తీగల వర్గానికి పని లేకుండా పోయింది. తీగల కూడా సైలెంట్ అయిపోయారు. అడపాదడపా సబిత, తీగల వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో తన వర్గాన్ని కాపాడుకోవాలంటే ఆయన పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Also Read: ముప్పు తప్పదు: కరోనా ఇక తగ్గే అవకాశాలు తక్కువేనా..!

ఈ అవకాశాన్ని బీజేపీ చేజిక్కించుకోవాలని చూస్తోంది. అందుకే.. అసంతృప్తి లీడర్లందరితో చర్చలు ప్రారంభించింది. కృష్ణారెడ్డినే కాకుండా మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారుట. గ్రేటర్ ఎన్నికలపై నేరుగా కిషన్ రెడ్డి దృష్టి పెట్టడంతో ముందు ముందు మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి పార్టీ క్యాడర్‌‌ను మరింత పెంచుకోవాలనే దాని మీదనే బీజేపీ దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.