కప్‌కు రెండడుగుల దూరంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్

భారత క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. సాధారణంగా అభిమానుల్లోనూ ఆ జట్టుపై భారీగానే అంచనాలు ఉండే. అదేస్థాయిలో ఆ జట్టు కూడా హడావుడి కూడా చేసింది. కప్‌ ఈసారి తమదేనంటూ ఎంతో ధీమాతో చెప్పారు. కానీ.. నిన్నటి మ్యాచ్‌తో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. 13వ ప్రయత్నంలోనైనా కప్పు కల నెరవేర్చుకోవాలనుకున్న కోహ్లీ సేనకు మళ్లీ నిరాశే ఎదురైంది. Also Read: క్రికెట్ లోగుట్టు: కోహ్లి.. రోహిత్‌లకు పడడం […]

Written By: NARESH, Updated On : November 7, 2020 11:27 am
Follow us on

భారత క్రికెట్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. సాధారణంగా అభిమానుల్లోనూ ఆ జట్టుపై భారీగానే అంచనాలు ఉండే. అదేస్థాయిలో ఆ జట్టు కూడా హడావుడి కూడా చేసింది. కప్‌ ఈసారి తమదేనంటూ ఎంతో ధీమాతో చెప్పారు. కానీ.. నిన్నటి మ్యాచ్‌తో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. 13వ ప్రయత్నంలోనైనా కప్పు కల నెరవేర్చుకోవాలనుకున్న కోహ్లీ సేనకు మళ్లీ నిరాశే ఎదురైంది.

Also Read: క్రికెట్ లోగుట్టు: కోహ్లి.. రోహిత్‌లకు పడడం లేదా..!

హైదరాబాద్‌ కాస్త సన్‌ ‘రైజ్‌’ అయి మరో గెలుపును తనఖాతాలో వేసుకుంది. బెంగళూరును ఓడించి సెమీష్‌కు చేరింది. ఎలాంటి పెద్దగా అంచనాలు లేకుండానే సన్‌రైజర్స్‌ జట్టు సెమీస్‌కి చేరింది. అసలు ప్లేఆఫ్స్‌కు కూడా చేరుతుందా అని అనుకున్న వారందరికీ గట్టి సమాధానమే ఇచ్చింది. వరుసగా ఐదో సారి ప్లే ఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌ రెండో టైటిల్‌కు రెండడుగుల దూరంలోనే ఉంది. అదిరే ఆటతో ఆర్‌‌సీబీని మట్టికరిపించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేప‌ట్టిన బెంగ‌ళూరు ఏ ద‌శ‌లోనూ హైద‌రాబాద్ బౌల‌ర్లను ఎదుర్కోలేక‌పోయింది. 20 ఓవ‌ర్లలో కేవ‌లం 131 ప‌రుగులే సాధించింది. డివిలియ‌ర్స్ ఒక్కడే అర్ధ సెంచ‌రీతో రాణించాడు. కోహ్లీతో స‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో హైద‌రాబాద్ కాస్త త‌డ‌బ‌డినా.. విలియ‌మ్సన్ (50 నాటౌట్ 44 బంతుల్లో) రాణించ‌డంతో.. మ‌రో రెండు బంతులు ఉండ‌గానే.. ఆరు వికెట్ల తేడాతో స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు  విజ‌యాన్ని అందుకుంది. మ‌నీష్ పాండే (24), హోల్డర్ (24 నాటౌట్‌) ఆక‌ట్టుకున్నారు. ఈ విజ‌యంతో హైద‌రాబాద్ క‌ప్పు వేట‌లో మ‌రో ముందడుగు వేసింది. ఈ ఆదివారం ఢిల్లీతో జ‌రిగే మ్యాజ్‌లో హైద‌రాబాద్ గెలిస్తే  ఫైన‌ల్‌లో అడుగుపెడుతుంది. ఇప్పటికే ఢిల్లీతో గెలిచిన ముంబై.. ఫైన‌ల్లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

Also Read: వైరల్: జోష్ గా కోహ్లీ బర్త్ డే వేడుకలు

మొత్తంగా ఐపీఎల్‌ 13 సీజన్‌లో మొదట్లో తడబడినట్లు కనిపించిన సన్‌రైజర్స్‌ కాస్త ప్లేఆఫ్స్‌ టైం వచ్చేసరికి పుంజుకున్నట్లు కనిపించింది. నిన్నటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో క్వాలిఫయర్‌‌ 2కు అర్హత సాధించింది. కేన్‌ విలియమ్సన్‌ చివరిదాకా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మరోవైపు చివరి వరకు కూడా ఈ మ్యాచ్‌ ఉత్కంఠను తీసుకొచ్చింది. చివరి ఆరు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో కేన్‌ ఫస్ట్‌ బాల్‌కు సింగిల్‌ తీసి తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత సైనీ డాట్‌బాల్‌ వేయడంతో మరింత టెన్షన్‌ పెరిగింది. కానీ.. ఆ తర్వాత రెండు బాల్స్‌ను బౌండరీకి చేర్చి హోల్డర్‌‌ మ్యాచ్‌ను ముగించాడు.