HomeతెలంగాణDWCRA Women: మహిళా గ్రూప్ సభ్యులకు గుడ్ న్యూస్..

DWCRA Women: మహిళా గ్రూప్ సభ్యులకు గుడ్ న్యూస్..

DWCRA Women: తెలంగాణలో డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకు మహిళా గ్రూపులో సభ్యులుగా ఉంటే.. వారు ఒకవేళ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లయితే ఆ అప్పును సభ్యులే తిరిగి చెల్లించాల్సి ఉండేది. ఇలాంటి సమయంలో పేదలు తమ ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బందులు పడేవారు. దీంతో వారి జీవితం పై ప్రభావం పడి అగమ్య గోచర పరిస్థితి ఏర్పడేది. అయితే ఈ సమస్య నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి కొత్తగా స్కీం తీసుకురాబోతోంది. దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇప్పటివరకు డ్వాక్రా మహిళలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరు వ్యాపారం చేసే సమయంలో ప్రత్యేకంగా ఎటువంటి బీమా తీసుకోవడం లేదు. దీంతో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా ఆమెపై బ్యాంకు రుణం భారమయ్యేది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఇల్లు, ఫర్నిచర్ కూడా అమ్ముకునేవారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన బీమా పాలసీ ప్రకారం రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే మిగిలిన అప్పును ప్రభుత్వం నేరుగా బ్యాంకు చెల్లిస్తుంది.. ఇలా చెల్లించడం ద్వారా కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. అంతేకాకుండా అదనంగా ఆ సభ్యురాలికి రూ 10 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. దీనికి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద వారితో పాటు మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది

జీవనోపాధి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం మీ చర్యలు తీసుకోవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకవైపు ఆర్థిక భరోసా ఉండడంతో పాటు మరోవైపు ఎలాంటి ఆందోళనకరమైన ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో చాలామంది బీమా తీసుకుంటున్నారు. కానీ కార్యాలయాల్లో పనిచేసేవారు వీటిపై ఆసక్తి చూపడం లేదు. అందువల్ల ఇంటింటికి వచ్చి దీనిపై ప్రచారం చేయనున్నారు. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తరంలో వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు బ్యాంకులో, అధికారులతో సమావేశం అవుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version