సోనూ సూద్ ఇంత సాయం ఎందుకు చేస్తున్నాడో తెలుసా?

సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే సోనూసూద్‌.. లాక్‌డౌన్‌ టైంలో చాలా మందికి దేవుడయ్యాడు. ఆ స్థాయి సహాయం కూడా మరెవరూ చేయలేదు. ప్రజల కష్టాలను చూసిన సోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. రైతుకు ట్రాక్టర్‌‌ కొనిచ్చాడు. విద్యార్థులకు సెల్ఫోన్లు అందించాడు. మరెంతో మందికి ఉపాధినిచ్చాడు. ఒకటా రెండా సోను చేసిన సేవలు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ అయితే.. ఇంత పెద్ద మొత్తంలో ఆదుకుంటున్న సోనూసూద్‌కు ఒక్కసారిగా ఆ ఆలోచన […]

Written By: NARESH, Updated On : November 7, 2020 11:22 am
Follow us on

సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే సోనూసూద్‌.. లాక్‌డౌన్‌ టైంలో చాలా మందికి దేవుడయ్యాడు. ఆ స్థాయి సహాయం కూడా మరెవరూ చేయలేదు. ప్రజల కష్టాలను చూసిన సోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. రైతుకు ట్రాక్టర్‌‌ కొనిచ్చాడు. విద్యార్థులకు సెల్ఫోన్లు అందించాడు. మరెంతో మందికి ఉపాధినిచ్చాడు. ఒకటా రెండా సోను చేసిన సేవలు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అయితే.. ఇంత పెద్ద మొత్తంలో ఆదుకుంటున్న సోనూసూద్‌కు ఒక్కసారిగా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది..? అంత పెద్ద మనసు ఎలా వచ్చింది..? ఆ విషయాలను సోనూ పంచుకున్నాడు. ‘లాక్ డౌన్ టైమ్‌లో ప్రజలంతా నడుచుకుంటూ వేల కిలోమీటర్లు వెళ్తున్నారు. నాకు సహాయం చేయాలని మనసులో ఉంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. హైవేపై నడిచివెళ్తున్న వాళ్లకు పండ్లు ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓరోజు ఓ గుంపు నా దగ్గరకొచ్చింది. తమకు 10 రోజులకు సరిపడా పండ్లు కావాలని వాళ్లు నన్ను అడిగారు. ఎందుకంటే, తామంతా కర్నాటకకు నడిచి వెళ్తున్నామని, ఆహారం కావాలని అభ్యర్థించారు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. వాళ్లకు 10 రోజులకు సరిపడా ఆహారం ఇచ్చే కంటే.. నేరుగా వాళ్ల గమ్యస్థానానికి చేరిస్తే మరింత ఆనందిస్తారని అనిపించింది. ఇక అప్పట్నుంచి నా సహాయం ఆ దిశగానే సాగింది.’

Also Read: మెగాస్టార్ అనుచరుడిగా సత్యదేవ్ !

ఇలా వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలనే ఆలోచన వెనక ప్రేరణను సోనూసూద్ బయటపెట్టాడు. మరోవైపు సినిమాలను తన సేవా కార్యక్రమాలను మిక్స్ చేసి చూడొద్దని రెక్వెస్ట్ చేశాడు. ఎప్పట్లానే విలన్ పాత్రలు చేస్తానని, మంచి కథలు వస్తే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తానని.. అంతే తప్ప తన సేవా కార్యక్రమాలు చూసి సినిమాలపై అంచనాలు పెట్టుకోవద్దని కోరుతున్నాడు సోనూ.

Also Read: రిస్క్ చేస్తున్న మంచు మనోజ్ !

అంతేకదా మరి.. టాప్‌ హీరో అయినంత మాత్రాన సాయం చేయాలని లేదు. విలన్‌ అయినంత మాత్రాన సాయం చేయొద్దనీ లేదు. రియల్‌ లైఫ్‌లో దేవుడైన సోనూసూద్‌ చేస్తున్న అన్ని సినిమాలూ హిట్‌ కావాలని లేదు కదా. అందుకే.. ఆయన కూడా ఈ అభ్యర్థన చేయడం కొసమెరుపు.