https://oktelugu.com/

హోంమంత్రి ఎదుటే ‘గులాబీ’ నేతల కుమ్ములాట..!

టీఆర్ఎస్ లో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న అసంతృప్తి ఎన్నికల సమయంలో బయటపడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. తాజాగా హోంమంత్రి ముందే గులాబీ నేతలు ఒకరిపై ఒకరి బాహాబాహికి దిగడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. Also Read: దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుపు ఫై ఉత్తమ్‌కు పరీక్ష. ! ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సమాయత్తం అవడంలో భాగంగా ఆదివారం గోషామహల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 01:18 PM IST
    Follow us on


    టీఆర్ఎస్ లో కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న అసంతృప్తి ఎన్నికల సమయంలో బయటపడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. తాజాగా హోంమంత్రి ముందే గులాబీ నేతలు ఒకరిపై ఒకరి బాహాబాహికి దిగడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.

    Also Read: దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుపు ఫై ఉత్తమ్‌కు పరీక్ష. !

    ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సమాయత్తం అవడంలో భాగంగా ఆదివారం గోషామహల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ.. తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. తొలుత నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్  వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నంద కిషోర్ వ్యాస్, కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి, ముఖేష్ సింగ్‌లను వేదిక మీదకు పిలిచారు.

    అయితే నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌వీ మహేందర్‌ను వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో మహేందర్ హోంమంత్రిని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడున్న కొందరు నాయకులు ‘నువ్వు పెద్ద లీడర్‌ అనుకుంటున్నావా.. నిన్ను ఎందుకు పిలవాలి’ అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో హోంమంత్రి, మాజీ ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పి మహేందర్ ను వేదికపైకి ఆహ్వానించారు. సమావేశం ముగిశాక హోంమంత్రి వెళుతున్న సమయంలో మరోసారి టీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు దుర్భాలాడుకున్నారు.

    అందరూ చూస్తుండగానే మహేందర్.. జైశంకర్ వర్గంలు రోడ్డుపై గంటపై కొట్టుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈనేపథ్యంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఇరువురి నేతల మధ్య రాజీ చేసినట్లు తెలుస్తోదంది. అయితే కొంతకాలంగా పార్టీలో అంతర్గత పోరు నడుస్తోందని టీఆర్ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

    Also Read: కేంద్రంతో కేసీఆర్‌‌ కయ్యం అందుకేనా..?

    గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ మంత్రుల ముందే కొందరు నేతలు తన్నుకున్నారు. అప్పుడు కూడా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని టాక్ ఉంది. తాజాగా జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మరోసారి టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి తెరపైకి రావడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!