‘క్రాక్’ నుంచి లాయర్ గా మారనున్న రవితేజ?

టాలీవుడ్లో లాయర్ పాత్రలకు ఫుల్ డిమాండ్ పెరిగినట్లు కన్పిస్తోంది. లాయర్ కథాంశంతో గతంలో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’తో గ్రాండ్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ తొలిసారి క్రిమినల్ లాయర్ గా కన్పించబోతుంటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. Also Read: ‘డార్లింగ్’ వెంటపడుతున్న ‘మన్మథుడు’..! ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా పవన్ బాటలోనే నడుస్తున్నాడు. […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:30 pm
Follow us on

టాలీవుడ్లో లాయర్ పాత్రలకు ఫుల్ డిమాండ్ పెరిగినట్లు కన్పిస్తోంది. లాయర్ కథాంశంతో గతంలో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’తో గ్రాండ్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ తొలిసారి క్రిమినల్ లాయర్ గా కన్పించబోతుంటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: ‘డార్లింగ్’ వెంటపడుతున్న ‘మన్మథుడు’..!

ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా పవన్ బాటలోనే నడుస్తున్నాడు. రవితేజ సైతం తొలిసారి లాయర్ పాత్రలో నటించనుండటం ఆసక్తిని రేపుతోంది. మారుతి-రవితేజ కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో రవితేజ లాయర్ గా అలరించనున్నాడనే టాక్ విన్పిస్తోంది. ‘జాలీ ఎల్ఎల్బీ’తో ఈ మూవీ రాబోతుందట. అందరినీ న‌వ్విస్తూ.. ఆలోచింప‌జేసే క‌థతో మారుతి-రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు మారుతి సినిమాల్లో వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇక రవితేజ కూడా వినోదానికి పెద్దపీఠ వేస్తుంటాడు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీని యూవీ.. గీతా ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read: మెగా హీరో పెళ్లి ఫిక్స్‌..

ప్రస్తుతం రవితేజ ‘కాక్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ మూవీ చేస్తుండగానే రవితేజ వరుసగా నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ‘క్రాక్’ సినిమా పూర్తయిన వెంటనే మారుతి-రవితేజ కాంబోలో సినిమా ప్రారంభం కానుందట. ఈ మూవీలోని నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది.