పవన్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత అంట..! నిజమెంత?

సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎన్ని వాస్తవాలు ఉంటాయో.. అన్ని అబద్ధాలూ ట్రోల్‌ అవుతుంటాయి. ఒక విధంగా సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సోషల్‌ మీడియాలో ఇటీవల ఫేక్‌ న్యూస్‌లు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ ఫేక్‌ వార్త హల్‌చల్‌ చేస్తోంది. Also Read: పవన్‌తో కన్నడ నటుటు సుదీప్‌ భేటి.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:25 pm
Follow us on


సోషల్‌ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎన్ని వాస్తవాలు ఉంటాయో.. అన్ని అబద్ధాలూ ట్రోల్‌ అవుతుంటాయి. ఒక విధంగా సోషల్‌ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సోషల్‌ మీడియాలో ఇటీవల ఫేక్‌ న్యూస్‌లు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ ఫేక్‌ వార్త హల్‌చల్‌ చేస్తోంది.

Also Read: పవన్‌తో కన్నడ నటుటు సుదీప్‌ భేటి..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ భద్రతను కల్పించిందంట. ఇదే ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని విన్న ఆయన అభిమానులు నమ్మడమే కాదు.. ఏకంగా తమదైన వ్యాఖ్యలను యాడ్‌ చేస్తూ ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఈ మధ్యనే కేంద్ర సర్కార్‌‌ వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్టంరాజుకు జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను ఇచ్చింది. మరో వ్యవహారంలో బాలీవుడ్‌ స్టార్‌‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు కేంద్ర బలగాల భద్రతను ఇచ్చింది.

ఈ నేపథ్యంలో పవన్‌కు కూడా జెడ్‌ కేటగిరీ భద్రత ఇచ్చినట్లుగా చేస్తున్న ప్రచారాన్ని అందరూ నమ్మేశారు. అయితే.. ఇందుకూ పలు కారణాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ వ్యాఖ్యలు ఆ ప్రచారాన్ని అందరూ నమ్ముతున్నారట. ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు పవన్‌ ప్లాన్‌ చేస్తున్నారని, అందుకే ఆయనకు ఈ భద్రత కల్పిస్తున్నట్లు అనుకుంటున్నారు. ఈ మధ్య బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పవన్‌ భద్రతను 22 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది, నలుగురు జాతీయస్థాయి ఎన్‌ఎస్‌జీ కమాండోలు పర్యవేక్షిస్తారని ప్రచారం జరిగింది.

Also Read: ‘అల్లు’ స్టూడియో.. చాలా కాస్టీ గురూ..!

అయితే.. ఈ ఫేక్‌ న్యూస్‌పై జనసేన స్పందించింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వట్టిదేనని కొట్టిపారేసింది. భద్రత కోసం కేంద్రాన్ని కోరలేదని.. కేంద్రం కూడా పవన్‌ను సంప్రదించలేదని తేల్చింది. తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది. అయితే.. పవన్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత అంటూ పెట్టిన వార్తకు వచ్చినంత వైరల్‌ మాత్రం జనసేన వివరణకు రాలేదు. ఆయన అభిమానులు జనసేన ఇచ్చిన వివరణను ఆ స్థాయిలో ట్రోల్‌ చేయలేకపోయారు.