TRS Plenary: అసలు ఉనికి లేని తెలంగాణకు ఒక ఉద్యమ పంథాతో అలజడి రేపింది తెలంగాణ రాష్ట్రసమితి. కేసీఆర్ లాంటి బక్కపలుచని ఒక నేత ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ప్రస్థానం.. స్వరాష్ట్రం సాధించి తొలి ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి బాటలో పయనించే వరకూ సాగింది. టీఆర్ఎస్ పుట్టి నేటికి 21 ఏళ్లు. అసలు కలలో కూడా ఊహించని విజయాలను సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభించిన టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ సాధించిన పార్టీగా అవతరించింది. ఇప్పుడు తెలంగాణ టు ఢిల్లీకి అడుగులు వేస్తోంది.
-ఉద్యమంతో స్వరాష్ట్ర సాధన
చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో కేసీఆర్ బయటకొచ్చాడు. తెలంగాణ కోసం నడుం బిగించాడు. ఈక్రమంలోనే జలదృశ్యంలో కొద్దిమందితో టీఆర్ఎస్ స్థాపించారు. తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే టీఆర్ఎస్ సత్తా చాటింది. అనంతరం 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పలు ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. కేసీఆర్ కేంద్రమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. అయితే తెలంగాణ సాధనే లక్ష్యంగా అనుకున్నారు.కానీ కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో రాజీనామాలతో మళ్లీ మళ్లీ గెలుస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు.
Also Read: Minister RK Roja: దూకుడు పెంచి మంత్రి రోజా.. విపక్షాలపై విశ్వరూపం చూపిస్తున్న ఫైర్ బ్రాండ్
2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై మోసం చేసినకాంగ్రెస్ ను వీడిన కేసీఆర్ నాడు మహాకూటమిలో చంద్రబాబు, కమ్యూనిస్టులతో కలిసి పోటీచేశారు. నాడు చాలా తక్కువ సీట్లకే పరిమితమయ్యారు. అయితే కాంగ్రెస్ ను గద్దెనెక్కించిన వైఎస్ఆర్ రెండో సారి సీఎం అయ్యాక అనూహ్యంగా హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఏపీలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకున్న కేసీఆర్ ‘ఆమరణ దీక్ష’తో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించాడు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, సబ్బండ వర్గాలు కలిసి వచ్చి సకల జనుల సమ్మె చేయడంతో ఈ ఉద్యమం అంతిమ స్థాయికి చేరింది. దేశాన్ని చివరకు కాంగ్రెస్ దిగివచ్చి 2014లో తెలంగాణను ప్రకటించింది. ఇచ్చింది కాంగ్రెస్ అయినా.. తెచ్చింది మాత్రం కేసీఆర్ టీఆర్ఎస్ అని పేరు తెచ్చుకుంది.
-టీఆర్ఎస్.. ఉద్యమ పార్టీ టు రాజకీయ పార్టీ
ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ ను 2014 ఎన్నికల వేళ రాజకీయ పార్టీగా మార్చి ప్రజలకు ఎన్నో హామీలిచ్చి కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం అయ్యారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లో విలీనాన్ని కాదనుకొని ఒంటరిగా టీఆర్ఎస్ ను నిలబెట్టి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్నారు. ఢిల్లీ బాట పడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లో ఆ పార్టీదే ఆధిపత్యం.. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు అనేక సవాళ్లు టీఆర్ఎస్ ముందు ఉన్నాయి. రెండు సార్లు గెలిచిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలవడం కానకష్టంగా మారింది. వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
-ఢిల్లీని గురిపెడుతున్న కేసీఆర్
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీని గురిపెడుతున్నాడు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానంటున్నారు. ఆయన పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఈసారి ప్లీనరీలోనూ అదే వాతావరణం కనిపిస్తోంది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ కేటీఆర్ జాతీయ రాజకీయాల వైపు తమ అడుగులు పడుతాయని హింట్ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వానికి సోయి వచ్చేలా చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ అడుగులు జాతీయ స్థాయిలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ టార్గెట్ గా కేసీఆర్ ఈ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ప్లీనరీలో రోడ్ మ్యాప్ ఖరారు చేసుకోబుతున్నారని సమాచారం.
-టీఆర్ఎస్ కు అడ్డంకులు ఇవే
కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లే ముందు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు గెలవాలి. ఇంటి గెలిస్తేనే రచ్చ గెలిచేది. కానీ అదంతా ఈజీ కాదు. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత బోలెడంత ఉంది. చంద్రబాబులా ఏపీని వదిలేసి ఢిల్లీలో తిరిగితే ఆయన ఓడినట్టే కేసీఆర్ కూడా ఓడిపోతారు. తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ పొంచి ఉంది. వ్యతిరేకత నేపథ్యంలోనే నిరుద్యోగులకు కూల్ చేసేందుకు వరుస ఉద్యోగాలను కేసీఆర్ సర్కార్ వేస్తోంది.
-పీకేను వ్యూహకర్తగా కేసీఆర్ ముందుకు..
జాతీయరాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. పీకే ‘ఐప్యాక్’తో ఒప్పందం చేసుకొని ఎన్నికలు ఈదాలని చూస్తున్నారు. తన సొంత వ్యూహాలపై నమ్మకం సడలి పీకేతోపాటు వెళ్లాలని చూస్తున్నారు. కేసీఆర్ తెలంగాణలో గెలవడంతోపాటు ఢిల్లీలో చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరూ ఊహించని రీతిలో ఎన్నో అద్భుతాలు కేసీఆర్ చేశాడు. స్వరాష్ట్రం సాధించి అభివృద్ధి, సంక్షేమంతో ఆకట్టుకున్నారు. మరి ఇన్ని అడ్డంకులు అధిగమించి కేసీఆర్ తెలంగాణ సాధించినట్టే ఢిల్లీ గడ్డపై కాలుమోపుతాడా? జాతీయ రాజకీయాలను శాసిస్తాడా? అన్నది వేచిచూడాలి.
Also Read:Prashant kishor- YCP: పీకే సేవలు వైసీపీకి అక్కర్లేదా? ఈ వ్యూహం వెనుక మర్మమేమిటి?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Trs celebrates 21 years plenary session
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com