Income Tax Trolls: ఇన్ కం టాక్స్..ఇదో బ్రహ్మ పదార్థం. ఎవరికీ ఎప్పటికీ అర్థం కాదు. ఆ పన్నులేమిటో.. శ్లాబ్ విధానాలు ఏమిటో ఎప్పటికీ అంతు పట్టవు. ఇటీవల 12.75 లక్షల వార్షిక వేతనం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ప్రకారం చాలామంది వేతన జీవులు తమకు వెసులుబాటు కలిగిందని భావించారు. కానీ ఇదే సమయంలో అంతకంటే ఎక్కువ సంపాదించేవారు ఒక్కసారిగా పెదవి విరిచారు. బడ్జెట్లో తమకు దక్కిన ప్రయోజనం ఏంటని? నిట్టూర్చారు.
ముందుగానే చెప్పినట్టు బడ్జెట్ అనేది ఒక బ్రహ్మ పదార్థం. అది ఎవరికీ అర్థం కాదు. కానీ దశాబ్దాల ముందే ఇది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గొల్లపూడి మారుతి రావు గారికి అర్థమైనట్టుంది. అందువల్లే ఆయన ఒక సినిమాలో బడ్జెట్ గురించి తనదైన స్టైల్ లో చెప్పేశారు..” మన సంపాదించింది పన్ను రూపంలో మరెవరికో ఎందుకు చెల్లించాలి.. మనం జీతం సంపాదిస్తున్నాం కాబట్టి.. ఇప్పుడైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ మన జీతం తగ్గి.. మనం ఆర్థికంగా కష్టాలు పడితే మనం పన్ను చెల్లించిన ప్రభుత్వం ఏమైనా తిరిగి మనకు చెల్లిస్తుందా?” అని మారుతి రావు గారు చెబుతుంటారు. నేటి కాలంలో ప్రభుత్వాలు దుబారాగా ఖర్చులు చేయడం.. ప్రజలపై అడ్డగోలుగా పన్నులు మోపడంతో.. చాలామందికి కోపం వస్తోంది. ముఖ్యంగా పన్నులను చెల్లించే వారికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే వారు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో రీల్స్, ట్రోల్స్ రూపంలో బయటపెడుతున్నారు. అలా కొంతమంది నెటిజన్లు వెతికి వెతికి గొల్లపూడి మారుతిరావు వీడియోను బయటికి తెచ్చారు.. మరి కొంతమంది అయితే ఆ మధ్య చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన గుకేష్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. చెస్ చాంపియన్ షిప్ ద్వారా గుకేష్ భారీగా ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అయితే మన దేశపు ఆదాయపు పన్ను చట్టాల ద్వారా అతడు 30 శాతానికి మించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఎటువంటి మినహాయింపు ఇవ్వకపోవడంతో గుకేష్ ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఈ విషయాన్ని కూడా నెటిజన్లు బడ్జెట్ అనంతరం సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. “ప్రభుత్వాలు పథకాలు గొప్పగా అమలు చేస్తున్నామని చెబుతుంటాయి. కానీ ప్రజల పన్నులు పీకి ఇలా ఇబ్బంది పెడుతుంటాయి. సంపాదించే వాడిపై మరింత భారాన్ని మోపుతుంటాయి. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉచిత పథకాలు అమలు చేస్తూ జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి. పథకం అమలు కోసం డబ్బు చెల్లించేవాడు.. పథకం ద్వారా లబ్ధి పొందినవాడు.. ఇద్దరూ ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తూనే ఉంటారు. కానీ చెల్లించిన ఆ పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయనేది ఇప్పటికీ అర్థం కాదు. అందువల్లే మన పన్నుల వ్యవస్థ లోప భూయిష్టమైనది. అది బ్రహ్మ పదార్థానికి మించి సంక్లిష్టమైనదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం ఎలా మారుతుంది
సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినా.. ఇంకెన్ని రకాల విమర్శలు చేసినా ప్రభుత్వ మారే అవకాశం లేదు. పన్నుల విధానం మారే అవకాశం అంతకన్నా లేదు. ఏదో జనాలకు కోపం వచ్చి ఇలా తమ అగ్రహాన్ని తీర్చుకుంటారు తప్ప.. అంతకుమించి జరిగే ప్రయోజనం ఉండదు. చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తూనే ఉండాలి. మోస్తున్న భారాలు మోస్తూనే ఉండాలి. చివరికి పన్నులు చెల్లించేవారు ఇలా సైలెంట్ గా ఉండిపోవాలి.
ఆదాయపు పన్నుపై ట్రోల్స్ ఎన్ని ఉన్నా.. గొల్లపూడి మారుతీరావు గారి ఈ మాటలు మాత్రం వేరే స్థాయిలో ఉన్నాయి. ఇందులో కొన్ని బూతులు ఉన్నప్పటికి ఈ కాలానికి భలే నప్పేలా ఉన్నాయి. ఎందుకంటే కట్టేవాడికి తెలుస్తుంది ఆ బాధ..#UnionBudget2025 #IncomeTax #NirmalaSitharaman #IncomeTaxtrolls pic.twitter.com/n9qafuBn4e
— Anabothula Bhaskar (@AnabothulaB) February 3, 2025