Rana Naidu : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే చాలామంది ప్రేక్షకులు సినిమాలను చూసి ఎంటర్టైన్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళు థియేటర్లో సినిమాలను చూడటమే కాకుండా ఓటిటిలో కూడా చాలా మంచి సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సిరీస్ ల విషయంలో మాత్రం ఎక్కడ తగ్గకుండా ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఓటిటిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి చాలా మంచి సిరీస్ లను ,సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంలో ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భం లోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతున్న కొన్ని సినిమాలు సిరీస్ లు ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
వెంకటేష్, రాణా లీడ్ రోల్ లో నటించిన ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అయింది. అలాగే చాలామంది ఈ సిరీస్ ని చూసి సిరీస్ ను చాలా సక్సెస్ చేశారనే చెప్పాలి. ఇంకా దానికి సీక్వెల్ గా ఇప్పుడు రానా నాయుడు 2 (Rana Naidu 2) కూడా స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.
ఇక దాంతోపాటు కీర్తి సురేష్, రాధిక ఆప్టే కలిసి నటించిన ‘అక్క’ (Akka) అనే వెబ్ సిరీస్ కూడా నెట్ ఫిక్సస్ స్ట్రీమింగ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక వీటితో పాటుగా సందీప్ కిషన్ లీడ్ రోల్ లో చేస్తున్న ‘సూపర్ సుబ్బు’..అలాగే థ్రిల్లర్ కోహ్రా సీజన్ 2, దిల్లి క్రైమ్ సీజన్ 3, గ్లోరీ మండల మర్డర్స్, ది రాయల్స్ సిరీస్ ను నెట్వర్క్ లో స్ట్రీమింగ్ గా ఉన్నాయి.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 కూడా స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. మాధవన్, నయనతార, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ టెస్ట్ ఈ సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. రాజ్ కుమార్ రావు, సానియా మల్హోత్ర ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘టోస్టర్ ‘ సినిమా సైతం స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది.
ఇక ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో రాబి గ్రేవాల్ రూపొందించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ జ్యూవెల్ థీఫ్ అనే మూవీ కూడా స్ట్రోనింగ్ కి రెడీ అవుతుంది…ఇలా మొత్తానికైతే నెట్ ఫ్లిక్స్ లో భారీ సిరీస్ లు సినిండ్లు స్ట్రీమింగ్ కి వస్తుండటం విశేషం…