https://oktelugu.com/

AP CMO: ఏపీ సీఎంవోలో దొంగలు పడ్డారు

సీఎం పేషీలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి బంధువు ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి అని తెలుస్తోంది. ఓ చిన్న ఉద్యోగి సాయంతో ఈ మొత్తం తతంగం నడిపారని.. అప్రూవల్స్ కోసం కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

Written By: , Updated On : August 4, 2023 / 04:33 PM IST
AP CMO

AP CMO

Follow us on

AP CMO: ఏపీలోనే కాదు చివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో సైతం పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం ఓలో అటెండర్ అందరి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యి..ఎవరికీ తెలియకుండా ఉత్తర్వులు ఇచ్చారట. సీఎంఓ లాగిన్ నుంచి ఉత్తర్వులు అంటే.. సీఎం ఉత్తర్వులు ఇచ్చినట్టే కదా. ఇక్కడే ఏదో తేడా కొడుతుంది.

గతంలో కూడా ఏపీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీలో 100 కోట్ల వరకు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో దొంగ చెక్కులతో డ్రా చేసుకునే ప్రయత్నం చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వందల ఫైళ్ళకు అప్రూవళ్లను దొడ్డిదారిన జారీ చేసినట్లు ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. వాస్తవానికి సీఎంఓలో అనుమతి పొందాల్సిన ఫైల్స్.. ఈ ఫైలింగ్ ద్వారా చేరుతాయి. వాటిని పరిశీలించి సీఎం అనుమతితో పేషీ నుంచి ఉత్తర్వులు జారీ అవుతాయి. దీనికోసం సీఎంఓ అధికారులు లాగిన్ అయి డిజిటల్ సైన్ చేయాలి. అయితే ఇప్పుడు వారికి తెలియకుండా వందల సంఖ్యలో అప్రూవల్స్ అయ్యాయి. ఈ విషయం బయట పడేసరికి అధికారులు తెగ ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు పెట్టి ముగ్గురుని అరెస్ట్ చేశారు. వారు చిరు ఉద్యోగులు, అటెండర్లు. లాగిన్,పాస్వర్డ్ తెలుసుకుని అప్రూవల్స్ ఇవ్వడం వారి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కచ్చితంగా సీఎంఓ లో పెద్ద తలకాయకే ప్రమేయం ఉంటుంది. కానీ చిన్న వారిని బాధ్యులను చేసి.. అసలు వారిని తప్పిస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సీఎం పేషీలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి బంధువు ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి అని తెలుస్తోంది. ఓ చిన్న ఉద్యోగి సాయంతో ఈ మొత్తం తతంగం నడిపారని.. అప్రూవల్స్ కోసం కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అందుకే చిన్న కేసులతో సరిపెడుతున్నారని తెలుస్తోంది. సీఎం అప్రూవల్సును ఒక చిన్నపాటి అటెండర్ కి ఇవ్వడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దేశంలో ఎంతటి దారుణమైన గవర్నన్స్ ఎక్కడ ఉండదన్న విమర్శ వ్యక్తం అవుతోంది.

సీఎం ఓలో ఒక పెద్ద అధికారి రాజ్యమేలుతున్నారు. ప్రతి ఫైలుకు 20% ముట్టనిదే ముందుకు కదలదన్న కామెంట్ ఉంది. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ ఆయన అవినీతిపై ఫోకస్ పెంచింది. ఏకంగా ఇద్దరు రిటైర్డ్ అధికారులను నియమించింది. ఎక్కడెక్కడ బినామీ ఆస్తులను కొనుగోలు చేసిన దానిపై ఆరా తీసింది. సీఎంవో మొత్తం అవినీతిమయంగా మారిందని.. సిబిఐ తో సమగ్ర దర్యాప్తు చేయించాలని టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎంఓ అవినీతిపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.