https://oktelugu.com/

Baby Producer SKN: ప్రెస్ పై బేబీ నిర్మాత ఎస్కేఎన్ బౌన్సర్స్ దాడి… ఒకరికి గాయాలు!

అనంతరం ఎస్కేఎన్ కారును జర్నలిస్టులు అడ్డుకోవడంతో ఆయన క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. గాయాలైన ఓ జర్నలిస్టును స్థానిక ఆసుపత్రిలో చేర్చారట. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 4, 2023 / 04:27 PM IST

    Baby Producer SKN

    Follow us on

    Baby Producer SKN: భీమవరం వెళ్లిన బేబీ చిత్ర యూనిట్ స్థానిక మీడియాతో గొడవపడ్డట్లు తెలుస్తుంది. అక్కడ రసాభాస చోటుచేసుకుంది. బౌన్సర్ల దాడిలో ఒక విలేకరి గాయపడ్డట్లు సమాచారం. బేబీ మూవీ మూడు వారాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నాలుగోవారం కూడా వసూళ్లు తగ్గలేదు. ఇప్పటి వరకు రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. బేబీ వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రో విడుదల తర్వాత కూడా బేబీ థియేటర్స్ లో నిలబడటం విశేషం.

    ఈ విజయాన్ని అభిమానులతో జరుపుకునేందుకు బేబీ చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా భీమవరం వెళ్లారు. ఇక్కడ చిన్న సంఘటన చోటు చేసుకుంది. చిత్ర యూనిట్ ని చూసేందుకు ప్రేక్షకులు ముందుకు తోసుకు వెళ్లారు. వాళ్లలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు జర్నలిస్టులను బౌన్సర్లు తోసేశారు. ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులు గాయాలయ్యాయి. జర్నలిస్టులు ఎస్కేఎన్ తీరుపై మండిపడ్డారు. ఎస్కేఎన్ కూడా సహనం కోల్పోయాడు.

    అనంతరం ఎస్కేఎన్ కారును జర్నలిస్టులు అడ్డుకోవడంతో ఆయన క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. గాయాలైన ఓ జర్నలిస్టును స్థానిక ఆసుపత్రిలో చేర్చారట. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బేబీ టీమ్ అత్యుత్సహం ఇందుకు కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. బేబీ మూవీ కోట్ల లాభాలు తెచ్చి పెట్టిన క్రమంలో ఎస్కేఎన్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు.

    ఇక బేబీ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ రోల్ చేసింది. కీలకమైన పాత్రలో విరాజ్ నటించారు. ఈ ముగ్గురి మధ్య నడిచే ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా బేబీ తెరకెక్కింది. దర్శకుడు సాయి రాజేష్ తో పాటు వైష్ణవి చైతన్యకు మంచి పేరొచ్చింది. ఈ క్రమంలో వైష్ణవి చైతన్యకు ఆఫర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయట. ఆమె చేతిలో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.