Mahakumbh : ఈ సారి ప్రయాగరాజ్‌లో జరిగే మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. మహా కుంభం 2025 జనవరి 13న పౌష పూర్ణిమ స్నానంతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి స్నానంతో కుంభమేళ ముగుస్తుంది. మేళా కోసం ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. మహా కుంభం కోసం సాధువులు, కల్పవాసులు, భక్తులు మాత్రమే కాదు ప్రయాగరాజ్ వాసులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహా కుంభంలో సంగమం, మేళా ప్రాంతంలో ప్రయాగరాజ్ దుకాణదారులు కూడా తయారు అవుతున్నారు. రుద్రాక్ష, పూజ సామాగ్రి, పత్ర-పంచాంగం, తులసి మాలలను నేపాల్, బనారస్, మథుర-వృందావన్ నుంచి వస్తున్నాయి. మహా కుంభానికి వచ్చే భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు సంగమ ప్రాంతం నుంచి పూజా సామాగ్రి, రోలి-చందనం, మత గ్రంథాలు, మాలలు తీసుకెళ్తారు.
రుద్రాక్ష, తులసి మాలలు ఎక్కడినుండి తెస్తారంటే?
మహా కుంభం సనాతన విశ్వాసానికి గొప్ప పండుగ. ఈ సందర్భంగా సనాతన ధర్మంలో విశ్వాసం ఉన్నవారు దేశ నలుమూలల నుంచి ప్రయాగరాజ్‌కు వస్తారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి పుణ్యాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మహా కుంభం సందర్భంగా 40 నుంచి 45 కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్‌కు రాబోతున్నారట. భక్తుల రాక, వారి స్నానం, వసతి ఏర్పాట్లను సీఎం యోగి ఆదేశాల మేరకు మేళా అథారిటీ పూర్తి ఉత్సాహంతో చేస్తున్నారు.
ప్రయాగరాజ్ వాసులు, ఇక్కడి దుకాణదారులు, వ్యాపారుస్థులు ఈ మేళ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. పుణ్యం, అదృష్టంతో పాటు వ్యాపారం, ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది ఈ మేళ. నగరంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, తినే దుకాణాలతో పాటు పూజా సామాగ్రి, మత గ్రంథాలు, మాల-పువ్వుల దుకాణాలలో చాలా విక్రయాలు జరుగుతాయి. మహా కుంభానికి వచ్చే భక్తుల కోసం ఇతర నగరాల నుంచి కూడా వస్తువులు తెప్పిస్తున్నారట. రుద్రాక్ష మాలలు ఉత్తరాఖండ్, నేపాల్ నుంచి, తులసి మాలలు మథుర-వృందావన్ నుంచి, రోలి, చందనం, ఇతర పూజా సామాగ్రి బనారస్, ఢిల్లీలోని పహాడ్‌గంజ్ నుంచి తెప్పిస్తున్నారు అధికారులు.
గీతా ప్రెస్‌లో ముద్రించిన మత గ్రంథాలకు అత్యధిక డిమాండ్
దారాగంజ్‌లో మత గ్రంథాలు విక్రయించే సంజీవ్ తివారీ మాట్లాడుతూ… గీతా ప్రెస్, గోరఖ్‌పూర్‌లో ముద్రించిన మత గ్రంథాలు అత్యధిక డిమాండ్ పలుకుతున్నాయట. భక్తులు రామచరితమానస్, భగవద్గీత, శివపురాణం, భజనలు, ఆరతుల సంకలనాలను కూడా అడుగుతారట. అంతేకాదు పూజారులు వారణాసిలో ముద్రించిన పత్ర, పంచాంగాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. దీనితో పాటు మురాదాబాద్, బనారస్‌లో తయారైన ఇత్తడి, రాగి గంటలు, దీపాలు, విగ్రహాలు కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. మేళాలో కల్పవాసం చేసే భక్తులు, సాధువులు పూజ కోసం హవన సామాగ్రి, ఆసనాలు, గంగాజలం, దోనెలు-పళ్ళాలు, కలశాలు వంటివి తీసుకుంటారట. వీటిని కూడా దుకాణదారులు పెద్ద మొత్తంలో తెప్పించి నిల్వ చేస్తున్నారట.