Pushpa 2 OTT : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విడుదలై నెల రోజులు అయినప్పటికీ, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఓటీటీ లో ఈ చిత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. 58 రోజుల తర్వాత ఓటీటీ విడుదల ఉంటుందని మేకర్స్ అధికారికంగా చెప్పారు. అంటే సరిగ్గా 58 రోజులు పూర్తి అయిన వెంటనే ఈ సినిమా విడుదల చేయరు. 58 రోజుల తర్వాత ఎప్పుడైనా విడుదల చేయొచ్చు. అది వంద రోజుల తర్వాత కూడా అవ్వొచ్చు. చెప్పలేం, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప జోరు సంక్రాంతి ని దాటి, రిపబ్లిక్ డే వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టే. ఫిబ్రవరి నెలాఖరులో ఓటీటీ విడుదల ఉండే అవకాశం ఉందట. అప్పటి వరకు ఎదురు చూపులు తప్పవు.
అయితే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది కానీ, అల్లు అర్జున్ కి అడ్డా గా పిలవబడే కేరళలో మాత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. టాక్ పాజిటివ్ గానే వచ్చింది. కానీ మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ని అవమానించారనే కోపం తో ఈ చిత్రాన్ని అక్కడి ఆడియన్స్ బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప 2 ఇంటర్వెల్ సన్నివేశం లో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫహద్ ఫాజిల్ పై అల్లు అర్జున్ ఒంటేలు పోస్తాడు. ఈ సన్నివేశానికి ఫహాద్ ఫాజిల్ అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఆ ప్రభావం వల్లే ఈ సినిమా అక్కడ ఘోరమైన డిజాస్టర్ అయ్యిందని అక్కడి విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఈ సన్నివేశాన్ని ఓటీటీ వెర్షన్ లో ట్రిమ్ చేసి విడుదల చేయబోతున్నట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
అంతే కాదు ఎడిటింగ్ తీసివేయబడ్డ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో జత చేసి విడుదల చేస్తారనే టాక్ ఉంది. అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమా కేవలం మూడు గంటల నిడివి మాత్రమే ఉంటుంది. ఇకపోతే ఈ చిత్రంలోని వీడియో సాంగ్స్ ని యూట్యూబ్ లో మేకర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అత్యంత కీలకమైన ‘గంగో రేణుక తల్లి’ వీడియో సాంగ్ ని కూడా నిన్ననే విడుదల చేసారు. ఈ సాంగ్ అప్పుడే యూట్యూబ్ లో విడుదల చేసినందుకు అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పాట కారణంగానే ఈ చిత్రానికి నార్త్ ఇండియా లో బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయని అక్కడి ట్రేడ్ పండితుల నమ్మకం. ఆ పాట కోసమే రిపీట్స్ లో థియేటర్స్ కి వెళ్తున్న ఈ నేపథ్యంలో, అదే పాటని యూట్యూబ్ లో విడుదల చేయడం వల్ల కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని వాపోతున్నారు.