Premalu Movie Collections : గత ఏడాది పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి భారీ వసూళ్లను నమోదు చేసుకోవడమే కాకుండా, లాభాల విషయంలో కూడా రికార్డ్స్ ని నెలకొల్పి సంచలనం సృష్టించాయి. అలాంటి చిత్రాలలో ఒకటి మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ప్రేమలు’ అనే చిత్రం. కొత్త వాళ్ళతో ప్రముఖ మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ (పుష్ప ఫేమ్) నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించాడు. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం మలయాళం లో ఒక సునామీ అనే చెప్పాలి. కేవలం మలయాళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఈ చిత్రం డబ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. పెట్టిన డబ్బులకు 50 శాతం కి పైగా లాభాలు వచ్చాయట.
‘కల్కి’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలకు కూడా నిర్మాతలకు ఈ రేంజ్ లాభాలను తెచ్చిపెట్టలేదు. ఇప్పటి వరకు ఇండియా లో అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’, నయనతార ‘జై సంతోషి మాత’ చిత్రాలకు మాత్రమే ‘ప్రేమలు’ రేంజ్ లాభాలు వచ్చాయి. ఈ చిత్ర నిర్మాత ఫహద్ ఫాజిల్ కి గత ఏడాది గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ‘ప్రేమలు’ చిత్రం మాత్రమే కాదు, ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఆవేశం’ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇక నటుడిగా ఆయనని ఆవేశం చిత్రం మరో లెవెల్ కి తీసుకొని వెళ్లగా, రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 ‘ తో ఆయన పేరు పాన్ ఇండియా లెవెల్ లో ఎలా మారు మోగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇక ప్రేమలు లో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కి కూడా ఇప్పుడు క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.
ఈమెకి తెలుగు తో పాటు, హిందీ, తమిళం లో కూడా అవకాశాలు క్యూలు కడుతున్నాయి. తమిళం లో ఈమె విజయ్ చివరి చిత్రం లో అతని కూతురిగా నటిస్తుంది. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన బాలయ్య ‘భగవంత్ కేసరి’ కి ఈ చిత్రం రీమేక్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. పేరుకి మాత్రమే ఆమె హీరోయిన్, కానీ కథ మొత్తం బాలయ్య బాబు, మమిత బైజు చుట్టూనే తిరుగుతుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే మమిత బైజు రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుంది. శ్రీలీల ఎలా అయితే సౌత్ ఇండియా లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యిందో. ఆ రేంజ్ స్టేటస్ ని ఈమె కూడా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.