TRS-BJP: తెలంగాణలో విమర్శల జోరు కొనసాగుతోంది. పొత్తుల పంచాయితీలు తేలడం లేదు. అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ ఒకటే నని చెబుతుంటే కాంగ్రెస్ మాత్రం బీజేపీ టీఆర్ఎస్ రెండు లోపాయకారీ ఒప్పందం చేసుకున్నాయని ఆరోపిస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ రాహుల్ పై విమర్శలు చేస్తే దాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది.

మహబూబ్ నగర్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి టీఆర్ఎస్ ను విమర్శస్తే ఒక్క మాట అనని వారు రాహుల్ గాంధీ పర్యటనపై ఎందుకు నోరు పారేసుకుంటున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఇన్నాళ్లు రహస్యంగా కాపురం చేసినా ఇప్పుడు బట్టబయలు అవుతోంది. వారి గుట్టు రట్టవుతోంది. వరంగల్ లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటిస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని చెబుతున్నారు.

Also Read: Rajya Sabha Seats: రాజ్యసభ స్థానాలకు పార్టీ పల్లకి మోసేవారు వద్దు.. పారిశ్రామికవేత్తలే ముద్దు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టుతో దిమ్మతిరిగిపోతోందని తెలుస్తోంది. దీంతోనే టీఆర్ఎస్ కు ఏం చేయాలో అర్థం కావడం లేకే ఆరోపణలు చేస్తోందని దుయ్యబడుతున్నారు. రాజీవ్ గాంధీ మరణం తరువాత గాంధీ కుటుంబానికి అధికారం చేపట్టాలని అందరు కోరినా సున్నితంగా తిరస్కరించారు. కానీ మీరు అమరవీరుల త్యాగాల మీద నడిచి వారినే మరిచిపోతున్నారు. మీకు రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది.
రాహుల్ ను ఎన్నికల టూరిస్టు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన కేటీఆర్ స్థాయి ఏమిటో చూసుకోవాలని హితవు పలికారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు యువరాజులా ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలుసు. లేనిపోని నిందలతో ఎదుటివారిపై బురద జల్లే విధానానికి పూనుకోవడం నిజంగా దురదృష్టమే. రాబోయే రోజుల్లో ఎవరికి రోజులు మూడాయో తెలుస్తుంది. అందాకా కాస్త ఓపిక పట్టాలని సూచిస్తున్నారు.
Also Read: Alliances in AP: ఏపీలో పొత్తులు లెక్క పక్కా.. వైసీపీకి లాభమా..నష్టమా?
Recommended Videos:
[…] Also Read: TRS-BJP: టీఆర్ఎస్-బీజేపీ పొత్తు గుట్టు రట్… […]