Vijay Deverakonda Wedding Reception Controversy: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. వల్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. యంగ్ హీరోలు సైతం అడపదడప మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వాళ్ళను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక ను పెళ్లి చేసుకున్నాడు. ఇక మార్చి 4 వ తేదీన హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో రిసెప్షన్ ఈవెంట్ ను నిర్వహించాడు.. తన ఈవెంట్ కోసం విజయ్ చాలామంది సినిమా సెలబ్రిటీలకు ఇన్విటేషన్స్ ఇచ్చినప్పటికి కొంత మందికి మాత్రం ఆ ఇన్విటేషన్ అందలేదట. ఇక కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళంటే విజయ్ దేవరకొండకు పెద్దగా నచ్చినట్టుగా లేదు. ఇంతకి వాళ్ళెవ్వరంటే విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ గా తెలుస్తుంది.విశ్వక్ సేన్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో మంచి విజయాలు సాధించినప్పటికి గతంలో విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశాడు. అప్పటినుంచి అసలు వీళ్ళ మధ్య మాటలు లేవని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో విజయ్ సిద్దును సైతం పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే తన పెళ్లి రిసెప్షన్ లో ఈ ఇద్దరు ఎక్కడ కనిపించలేదు. ఇక మరి కొంతమంది అసలు విజయ్ వాళ్ళకు చెప్పలేదు అందుకే వాళ్ళు రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్!
నిజానికి ఇది ఎంతవరకు వాస్తవమనే విషయంలో క్లారిటి లేదు. కానీ మొత్తానికైతే వీళ్ళ మధ్య కొద్ది రోజుల నుంచి ఎక్కువగా మాటల్లేవని పలువురు సినిమా ప్రముఖులు సైతం తెలియజేశారు. విజయ్ దేవరకొండ తన రిసెప్షన్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించడం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తన అభిమానులైతే విజయ్ ఒక ఇంటివాడైనందుకు సంబరాలు చేసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక దాంతోపాటు రాహుల్ సంకృత్యాయన్ డైరెక్షన్ లో ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరం పూర్తి చేసి వీలైతే ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…