F3 As Same As F2: ‘విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్’ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ఈ కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ ట్రైలర్ ఆకట్టుకుందా ? లేదా ? అనే మ్యాటర్ పక్కన పెడితే.. ఎఫ్ 2 ప్రభావం ఎక్కువగా కనిపించింది. సీక్వెల్ కాబట్టి.. అలా ఉంది అనుకోవచ్చు. కానీ.. అదే తరహా కామెడీ ఉంటే.. హ్యాపీగా ‘ఎఫ్ 2’ చూసుకోవచ్చు కదా.

ఇక ‘ఎఫ్ 3’ ఎందుకు చూడాలి ? కాకపోతే, ‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు, కానీ ఆరో భూతం ఒకటి ఉంది, అదే డబ్బు…అంటూ ట్రైలర్ మొదలై.. చివర్లో అంతేగా అంతేగా అంటే.. ఈడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా ? అంటూ ట్రైలర్ ముగించిన విధానం బాగుంది. కాకపోతే ఈ సినిమా పై ఇంకా అంచనాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు.
Also Read: Janasena: స్పీడ్ పెంచిన జనసేనాని.. పవన్ ప్రసంగాల్లో పెరిగిన వాడీవేడీ
ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది. అదే విధంగా ఎఫ్ 2లోని వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది. ఎలాగూ ఈ సీక్వెల్ లోనూ తమన్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. తమన్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.
Also Read: Rajya Sabha Seats: రాజ్యసభ స్థానాలకు పార్టీ పల్లకి మోసేవారు వద్దు.. పారిశ్రామికవేత్తలే ముద్దు
Recommended Videos:
[…] Also Read: F3 As Same As F2: ప్చ్.. ‘ఎఫ్ 3’లోనూ ‘ఎఫ్ 2’ వాసనలే … […]
[…] Also Read: F3 As Same As F2: ప్చ్.. ‘ఎఫ్ 3’లోనూ ‘ఎఫ్ 2’ వాసనలే … […]
[…] Also Read: F3 As Same As F2: ప్చ్.. ‘ఎఫ్ 3’లోనూ ‘ఎఫ్ 2’ వాసనలే … […]