Homeఆంధ్రప్రదేశ్‌Poor Performance Of AP Ministers: మంత్రుల పూర్ ఫెర్ ఫార్మెన్ష్.. ఘాటు వ్యాఖ్యలు తగ్గించడంపై...

Poor Performance Of AP Ministers: మంత్రుల పూర్ ఫెర్ ఫార్మెన్ష్.. ఘాటు వ్యాఖ్యలు తగ్గించడంపై ఫీలవుతున్న సీఎం జగన్

Poor Performance Of AP Ministers: కొడాలి నాని, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్.. మంత్రులుగా ఉన్నప్పుడు ఈ త్రయం అంటే విపక్షాలకు వణుకే. ఎప్పుడు ఎలా ఉతికారేస్తారోఅన్న భయం. భూతులతో విరుచుకుపడతారన్న ఆందోళన ఉండేది. ప్రెస్ మిట్లలో అయినా, సభలు సమావేశాలోనైనా.. చివరికి అసెంబ్లీలోనైనా పదునైనా మాటలతో.. బూతు వ్యాఖ్యానాలతో విపక్ష నేతలను చుక్కలు చూపించేవారు. అయితే వారి మాటలు బోరు కొట్టాయో? లేక కొత్తవారితో విపక్షాలను మరింతగా క్రుంగదీయాలనుకున్నారో కానీ సీఎం జగన్ కొత్తగా కొంత మంది ఫైర్ బ్రాండ్లకు అమాత్య పదవులిచ్చారు. పదునైనా మాటలాడే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారికి అవకాశమిచ్చారు. అయితే సీఎం జగన్ ఆశించిన స్థాయిలో వీరు ఫెర్ ఫార్మన్ష్ లేదన్న టాక్ వైసీపీలో నడుస్తోంది. ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా బండ బూతులతో రెచ్చిపోయిన కొందరు ఇప్పుడు నోరు తెరవకపోవడంతో జగన్ ఫీలవుతున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. వారికి తన ప్యాలెస్ కు పిలిచి రిహార్సల్స్ ఇప్పించినా ప్రయోజనం లేకుండా పోతోందని.. వారి వ్యాఖ్యలు భూమరంగ్ అవుతున్నాయని పార్టీ పెద్దలు తెగ బాధపడుతున్నారట. మంత్రివర్గ విస్తరణ సమయంలో… మంత్రి పదవులు పోయిన కొందరు.. మంత్రి పదవులు వస్తాయని కొందరు… మంత్రి పదవులు నిలబెట్టుకునేందుకు కొందరు అప్పట్లో చంద్రబాబు, పవన్ లపై జగన్ మనసు మెప్పించేలా బూతులతో విరుచుకుపడేవారు. తీరా పదవులు పోయిన వారు మాకెందుకులే అని సైలెంట్ అయిపోయారు. పదవులు దక్కించుకున్న వారు ఆశించిన స్థాయిలో వ్యాఖ్యానాలు చేయలేకపోతున్నారు. కోరుకున్న పదవి రాలేకపోయిన వారు విపక్షాల జోలికి పోకూడదని నిర్ణయించుకున్నారు.

Poor Performance Of AP Ministers
Anil Kumar, Kodali Nani

Also Read: Venkaiah Naidu: రాష్ట్రపతిగా వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?

ఇటీవల పరిణామాలతో..

అయితే ఇటీవల పరిణామాలు వైసీపీ అమాత్యులతో పాటు తాజా మాజీల్లో పునరాలోచనలోకి నెట్టేశాయి. పరుష పదజాలం, బూతు పురాణంతో విరుచుకుపడితే అందరికీ శత్రువలు అయిపోతున్నామని.. పొరపాటున అధికారం అటు ఇటుగా మారితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అందుకే కాస్తా సైలెంట్ అయిపోతున్నారు. అయితే ఇది అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. పదవులు దక్కించుకునేందుకు, జగన్ కళ్లల్లో ఆనందం కోసం ఇప్పటివరకూ కామెంట్లు చేసేవారు. మంత్రివర్గ విస్తరణ చేసే వరకూ అవి జోరుగా సాగాయి కూడా. కానీ ఇప్పుడు అలాంటి వాయిస్‌లు ఎక్కువగా వినిపించడం లేదు. దీంతో జగన్ ఫీలయ్యారు. పిలిచి మళ్లీ గెలిస్తే మంత్రి పదవి అని ఆశ పెడుతున్నారు. గతంలోలా మాట్లాడాలంటున్నారు. మాట్లాడతారో లేదో కానీ ఇప్పటికైతే.. చాలా మంది తమ భవిష్యత్ ఏమిటని మథనపడుతున్నారు.

అధికారం మారితే..

అధికారం మారితే తాము అన్న మాటలకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అందుకే కొంత మంది సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేసుకున్నామని ఎవరైనా ఇక నోరు జారితే.. చంపడమో.. చావడమో చేస్తామని చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య జగన్ గతంలోలా.. చంద్రబాబును ఆయన కుటుంబాన్ని గట్టిగా తిట్టే వారి కోసం చూస్తున్నారు. కానీ వరుస పరిణామాలు, టీడీపీ, జనసేనల మధ్య పొత్తు సంకేతాలతో చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. ఒక వేళ అధికారానికి దూరమైతే రెండు పార్టీల శ్రేణులకు టార్గెట్ అవుతామని భయపడుతున్నారు. ఈ మధ్య మంత్రి గుడివాడ అమర్ నాథ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జనసేన శ్రేణులు ఏకంగా పాడి కట్టి నిరసన తెలిపాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఉంటే.. పొరపాటున అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని అధికార పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.

Poor Performance Of AP Ministers
Pavan Kalyan, CBN

Also Read: Professor Nageshwar: పొత్తులకు సైద్ధాంతికతతో పనిలేదు.. రాజకీయ వ్యూహల్లో భాగమేనంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

Recommended Videos:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular