
AP Employees: ఆంద్రప్రదేశ్ లో కష్టాలు స్వాగతం చెబుతున్నాయి. ఉద్యోగుల నుంచి ప్రజల వరకు అడుగడుగునా సమస్యలు కనిపిస్తున్నాయి. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులు, పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, రాష్ర్ట ఖజానా కోసం భూములు అమ్మేయొద్దని రైతులు, పాతిక వేల కోట్ల బకాయిలు పడిన డిస్కంల సమస్యలు ఏపీని అగాధంలోకి నెడుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమే వాటిని తాకట్టు పెడుతూ పబ్డం గడుపుకుంటోంది. ఫలితంగా ప్రభుత్వంపై విమర్శల దాడి పెరుగుతోంది.
రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఏపీ మనుగడ కష్టతరమే అనిపిస్తోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ర్టం గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా వైసీపీ ప్రతిష్ట మంటగలుస్తోంది. అయితే 14 ఎమ్మెల్సీ స్థానాలున్నందున వాటిని దక్కించుకోవడంతో వైసీపీ బలం మరింత పెరగనుంది. దీంతో వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్కలు చూపి తన ప్రతిష్ట మరింత నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
ఏపీలో ఉద్యోగుల జీవితాలకు కూడా గ్యారంటీ లేదు. సరైన సమయానికి వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీనిపై వారు ఆందోళన చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కానరావడం లేదు. దీంతో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారింది.
దీంతో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాష్ర్టం దివాళా తీస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు పొరుగు రాష్ర్టంపై వెటకారాలు మాట్లాడుతోంది. వైసీపీ నేతల తీరుతో ప్రజల్ని మరింత వేదనకు గురిచేస్తోంది. ప్రస్తుత తరుణంలో ఏపీ గట్టెక్కే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ ఖాళీలు.. ఇంటర్, డిగ్రీ అర్హతతో?