అతను ముస్లింల పాలిట హీరో.. అయితే ఇప్పుడు..

ఢిల్లీ హింసాకాండలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాయుత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఇప్పటికీ మోహరించి వున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాలని పోలీసులు, అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులకు ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయలకుపైగా పరిహారం అందించారు. అయితే 1984 అల్లర్ల బాధితుడైన మొహిందర్ సింగ్ ఇప్పుడు హీరోగా మారాడు. ఢిల్లీ అల్లర్లలో ముస్లింలు హిందువులను, హిందువులు ముస్లిం కుటుంబాలను రక్షించిన ఘటనలు చాలా ఉన్నాయి. గోకుల్‌పురికి చెందిన […]

Written By: Neelambaram, Updated On : March 7, 2020 6:18 pm
Follow us on

ఢిల్లీ హింసాకాండలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాయుత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఇప్పటికీ మోహరించి వున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాలని పోలీసులు, అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులకు ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయలకుపైగా పరిహారం అందించారు. అయితే 1984 అల్లర్ల బాధితుడైన మొహిందర్ సింగ్ ఇప్పుడు హీరోగా మారాడు. ఢిల్లీ అల్లర్లలో ముస్లింలు హిందువులను, హిందువులు ముస్లిం కుటుంబాలను రక్షించిన ఘటనలు చాలా ఉన్నాయి.

గోకుల్‌పురికి చెందిన మొహిందర్ సింగ్ ఫిబ్రవరి 24, 25 తేదీలలో 60 నుంచి 70 మంది ముస్లింలను తన మోటారుసైకిల్‌పై సురక్షిత ప్రదేశాలకు తరలించాడు. ఇప్పుడు పరిస్థితులు మెరుగైన నేపథ్యంలో బాధితులు గోహిల్‌పురికి తిరిగి రావడానికి మొహిందర్ సింగ్ కృషి చేస్తున్నారు. ఢిల్లీలో హింస తాండవిస్తున్న సమయంలో మొహిందర్ సింగ్, అతని కుమారులు.. బాధిత మహిళలు, పిల్లలను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. తరువాత ముస్లిం పురుషులను సురక్షితమైన ప్రదేశానికి తీసుకువచ్చారు. దింతో ముస్లిం కుటుంబాలన్నీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాయి. ఇప్పుడు మొహిందర్ సింగ్… బాధితులు తిరిగి తమ ఇళ్లకు రావడానికి వారిలో ఈ నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అలాగే హిందూ, ముస్లిం వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. 13 రోజుల అల్లర్ల తరువాత, మోహిందర్ సింగ్, ఫరూఖ్, ఇషాక్ తదితరులు గోకుల్‌పురిలో తమ దుకాణం తెరవడానికి వచ్చారు.

ఢిల్లీలో హింసకు పాల్పడిన షహనావాజ్ అలియాస్ షానును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతను దిల్బార్ నేగి అనే యువకుడి రెండు చేతులను నరికి, అతన్ని మంటల్లో సజీవంగా విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దిల్బార్… శివ విహార్ ప్రాంతంలో ఉన్న అనిల్ స్వీట్ హౌస్ లో పనిచేసేవాడు. అతని మృతదేహం దుకాణం లోపల పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. అల్లర్లను షానవాజ్ రెచ్చగొట్టాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.