చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష పడింది. ‘శంఖం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ సమయంలో విజయవాడలోని రాజ్యలక్ష్మి థియేటర్ యాజమన్యానికి-నట్టికుమార్ కు మధ్య వివాదం నెలకొంది. ఇటీవల నట్టికుమార్ పై చౌక్ బౌన్స్ కేసు నమోదయింది. శుక్రవారం ఈ కేసులో నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష, 6లక్షల జరిమానాను విధిస్తూ స్థానిక మెజిస్ట్రేట్ కె.దివ్యకృప తీర్పునిచ్చారు.
2009లో నట్టికుమార్ కరుణాలయ ఫిల్మ్ పేరుతో విశాఖలో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ‘శంఖం’ మూవీకి సంబంధించి విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్లో రెండువారాలు ప్రదర్శించేందుకు రూ.6.5లక్షలకు థియేటర్ యాజమాన్యంతో నట్టికుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా సినిమా ప్రదర్శనను వారంరోజుల్లోనే నిలిపేశారు. దీంతో యాజమాన్యానికి, నట్టికుమార్ కు మధ్య వివాదం నెలకొంది.
దీనిపై సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఇరువురి మధ్య చర్చలు జరిపారు. థియేటర్ యాజమాన్యానికి రూ.5.5లక్షలు ఇచ్చేలా నిర్మాత నట్టికుమార్ అంగీకరించాడు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యానికి నట్టికుమార్ ఇచ్చిన చౌక్ బౌన్స్ ఇచ్చాడు. అదికాస్తా బౌన్స్ అయింది. దీంతో ఆ థియేటర్ యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తాజాగా నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్షతోపాటు 6లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.