TRS Party: ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన పెద్దలు అత్యంత రహస్యంగా వ్యూహాలను అమలు చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ ఎస్ చేస్తోంది కూడా ఇదే. కేసీఆర్ ఏ పని చేసినా భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్తున్నారు. అందుకు తగ్గట్టు చాలా పథకాలను, ప్లాన్లను అమలు చేస్తున్నారు.
కాగా ఈ మధ్య ప్రగతి భవన్ లో రూపొందిస్తున్న వ్యూహాలు బయటకు తెలిసిపోతున్నాయంటూ అనుమానిస్తున్నారు కేసీఆర్ టీమ్. ప్రగతి భవన్‌లో ఉన్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతిపక్షాలకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ కొంత కాలంగా బీహార్‌కు చెందిన ఆఫీసర్లకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో మిగతా వారు తమకు ప్రాధాన్యత దక్కట్లేదనే అంసతృప్తిలో ఉన్నారంట.
Also Read: రష్యా సైన్యాన్ని గడగడలాడిస్తున్న ఒకే ఒక్కడు.. యుద్ధభూమిలో ప్రపంచ మేటి స్నైపర్..!
ఇలాంటి వారే ప్రతిపక్షాలకు ప్రభుత్వం చేయబోయే పనుల సమాచారాన్ని మోస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి ఇలాంటి అసంతృప్త ఆఫీసర్ల తరఫున మాట్లాడటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. రేవంత్ ఏదో కావాలని చేయలేదని, ఆ ఆఫీసర్ల సపోర్టుతోనే ఆయన అలా మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఎంతో రహస్యంగా ఉండాల్సిన ప్రగతిభవన్ ముచ్చట్లు ఇలా బహిర్గతం కావడానికి కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు కేసీఆర్ టీమ్. ఇప్పటికే కొందరిని ప్రగతి భవన్ నుంచి తొలగించారు. మరికొందరిని కూడా దూరం చేసే అవకాశం ఉంది. ఆఫీసర్లు కూడా చాలా హుషారు ఉంటారు. వచ్చేసారి కూడా అధికారంలో ఉన్న పార్టీనే గెలుస్తుంది అనుకుంటే నమ్మకస్తులుగా మెలుగుతారు. లేదనుకుంటే మాత్రం ప్రతిపక్షాలకు సమాచారం ఇచ్చి ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాక కీలక పోస్టులకు ఎసరు పెడతారు.
గతంలో ఏపీలో టీడీపీ హయాంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ కూడా అపరచాణక్యుడు. కాబట్టి ఈ విషయంలో ఏదో ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట. చూడాల మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.
Also Read: 12 కోట్ల మంది రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాలలో నగదు జమ!