https://oktelugu.com/

Anasuya Bharadwaj New Movie: డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌ తో అనసూయ భరద్వాజ్‌ కొత్త సినిమా

Anasuya Bharadwaj New Movie: ‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ ఓ సినిమా చేస్తోంది. డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా శరవేగంగా షూటింగ్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 13, 2022 / 01:13 PM IST
    Follow us on

    Anasuya Bharadwaj New Movie: ‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ ఓ సినిమా చేస్తోంది. డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

    Producer Sheshu Maranreddy

    కాగా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ…జయశంకర్‌ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మా సినిమా 80 శాతం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని ఏప్రిల్‌ లోపు కంప్లీట్‌ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయన ఇంకా మాట్లాడుతూ శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.

    Also Read: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు

    థియేటర్స్‌లో ఆ సీన్స్‌ తప్పకుండా నవ్వులు పూయిస్తాయి. చెప్పారు. జయశంకర్‌ వర్కింగ్‌ స్టెల్‌ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రోత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలియజేశారు.

    Anasuya Bharadwaj New Movie

    ఇక దర్శకుడు మాట్లాడుతూ.. మా చిత్రానికి అనూప్‌ సంగీతం చాలా ప్లస్‌ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్‌ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్‌’అని టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం.

    Also Read: తగ్గేదే లే అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మరి చరణ్ పరిస్థితేమిటి ?

     

    Tags