Homeఎంటర్టైన్మెంట్Ranabaali Endhayya Saami Song: పెళ్లి తర్వాత అభిమానులకు విజయ్ దేవరకొండ, రష్మిక స్వీట్ సర్ప్రైజ్..వీడియో...

Ranabaali Endhayya Saami Song: పెళ్లి తర్వాత అభిమానులకు విజయ్ దేవరకొండ, రష్మిక స్వీట్ సర్ప్రైజ్..వీడియో వైరల్!

Ranabaali Endhayya Saami Song: రీసెంట్ గానే రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసిన వీళ్ళే కనిపిస్తున్నారు . ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్లిద్దరు కలిసి ఉదయపూర్ విమానాశ్రయం లోకి వచ్చినప్పుడు, అభిమానులకు జంటగా కలిసి ఇచ్చిన ఫ్లైయింగ్ కిస్ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే నేడు అభిమానుల కోసం వీళ్లిద్దరు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ‘రణబలి’ మూవీ నుండిఒ ‘ఏందయ్యా సామీ’ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . ముఖ్యంగా ట్యూన్ పాత కాలం సినిమాల్లో ఉన్నట్లుగా ఉందని అంటున్నారు .

ముఖ్యంగా ఈ పాటలో విజయ్ దేవరకొండ లుక్ చాలా గంభీరంగా ఉంది. చూస్తుంటే ఇప్పటి వరకు ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే , ఈ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉన్నట్లుగా అనిపించింది. అదే విధంగా ఈ పాట చివర్లో విజయ్ దేవరకొండ , రష్మిక మధ్య జరిగే రొమాన్స్ కూడా చూడముచ్చటగా అనిపించింది. ప్రస్తుత జెన్ జీ ఆడియన్స్ కి లిప్ కిస్ లు , బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటేనే రొమాన్స్ గా భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా అలాంటివి చేయడం వల్లే యూత్ ఆడియన్స్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ని , మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. వీళ్ళ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా అలా పద్దతిగా , సంసార పక్షంగా ఉండడం విశేషం .

Also Read: విజయ్ దేవరకొండ ఆ ఇద్దరిని దూరం పెడుతున్నాడా..? కారణం ఏంటంటే..?

ఇకపోతే ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతం లో ఈయన ‘టాక్సీ వాలా’, ‘శ్యామ్ సింగ రాయ్ ‘ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు . ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడమే కాకుండా, రాహుల్ కి మంచి బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తో తన సక్సెస్ పరంపర ని కొనసాగించేలాగానే అనిపిస్తోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ , రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రమిది . గతంలో వీళ్లిద్దరు కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్ ‘ వంటి చిత్రాల్లో నటించారు . వీటిలో ‘గీత గోవిందం ‘ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగా, డియర్ కామ్రేడ్ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
Endhayya Saami Special Surprise | Ranabaali |Vijay Deverakonda,Rashmika |Rahul Sankrityan |Ajay–Atul

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version