CM Rekha Gupta: మహిళా దినోత్సవం రోజు మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతినెల మహిళల ఖాతాలో 2,500 జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Also Read: నా భార్య బ్రాహ్మణి నుంచి అది నేను నేర్చుకోవాలి.. నారా లోకేష్
దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి అధిష్టానం రేఖ గుప్తాను ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేసింది. రేఖ గుప్త బిజెపిలో సీనియర్ కార్యకర్తగా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకురాలిగా రేఖ గుప్త పేరుపొందారు. పైగా ఆమె పట్ల అధిష్టానానికి మంచి నమ్మకం ఉండడంతో ముఖ్యమంత్రిగా నియమించింది. ముఖ్యమంత్రిగా పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రేఖా గుప్త ఢిల్లీలో తన మార్కు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో బిజెపి అనేక వాగ్దానాలు ఇచ్చింది. అందులో మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని ప్రకటించింది. వార్షిక ఆదాయం 2.5 లక్షల వరకు ఉన్న 18 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ప్రతినెల 2500 ఇస్తామని వెల్లడించింది. దీని ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం 5,100 కోట్ల భారం పడుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి.. ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
మహిళా దినోత్సవం రోజున..
మహిళా దినోత్సవం రోజున మహిళలకు గుడ్ న్యూస్ అంటూ రేఖ గుప్త ఈ శుభవార్త చెప్పారు. ఈ పథకానికి మహిళ సమృద్ధి యోజన అనే పేరు పెట్టారు. దీనిని క్యాబినెట్ ఆమోదించిందని ఆమె వెల్లడించారు..” ఢిల్లీ మహిళలకు శుభవార్త. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా.. మా వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాం. మహిళల స్వయం సమృద్ధికి బాటలు వేయబోతున్నాం. మహిళా సమృద్ధి యోజన అనే పథకానికి ఢిల్లీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇకపై ప్రతినెల ఢిల్లీ మహిళలు ఖాతాలో 2500 జమవుతాయి. ఈ పథకం ద్వారా 5100 కోట్ల భారం ప్రభుత్వ మీద పడుతున్నప్పటికీ.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం అమలు కోసం త్వరలోనే రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. మహిళల ఆర్థిక స్వాబలంబన కోసం మేము కృషి చేస్తున్నాం. ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగిస్తాం. ప్రతిపక్షాలు విమర్శలు చేసినంత మాత్రాన మేము మహిళల సంక్షేమాన్ని పక్కనపెట్టం. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా నెరవేర్చుదాం. ఆ దిశగానే మేము అడుగులు వేస్తామని” రేఖ గుప్తా పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజున ఈ పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని పొలిటికల్ స్టంట్ గా ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.. ఇప్పుడే నగదు అకౌంట్లో వేసినట్టు హంగు ఆర్భాటాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Also Read: తెలంగాణ పరిస్థితి బాగాలేదు.. భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!