Trivikram Srinivas: పుష్ప 2తో దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో పుష్ప వసూళ్లు తెలియజేశాయి. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో బహుశా అల్లు అర్జున్ కావచ్చు. పుష్ప ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.
పుష్ప 2 అనుకున్న సమయం కంటే ఏడాది లేట్ అయ్యింది. చాలా కాలం క్రితమే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీకి సైన్ చేశాడు. అధికారిక ప్రకటన కూడా జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ నిర్మించాల్సి ఉంది. అల్లు అర్జున్ ముందుగా ఒప్పుకున్న ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టి దర్శకుడు అట్లీ తో మూవీ చేస్తున్నాడు అనేది కొద్దీ రోజుల నుండి గట్టిగా వినిపిస్తున్న మాట. దాదాపు మూవీ ఖాయమైంది. అధికారిక ప్రకటనే తరువాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట.
త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీపై ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం కలదని అంటున్నారు. ఇదిలా ఉండగా ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ తో మూవీ చేసేందుకు త్రివిక్రమ్ పావులు కదుపుతున్నాడట. వీరిద్దరి కాంబోలో ఇంత వరకు మూవీ రాలేదు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసిన త్రివిక్రమ్ ప్రభాస్ తో ఒక్క మూవీ కూడా చేయలేదు.
దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఒక కథ రాశారట. ఈ కథతో ప్రభాస్ తో మూవీ చేయాలి అనేది త్రివిక్రమ్ ఆలోచన అట. ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడట. ప్రభాస్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు దిల్ రాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ఓకే అయినా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టం. ప్రభాస్ లైనప్ చాలా పెద్దగా ఉంది. కనీసం 3-4 ఏళ్ళు ఆయన ఫ్రీ అయ్యే సూచనలు లేవు.