తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న బిజెపి తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణంతో ఆ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసే పాపులర్ నేతల కొరతతో రాజకీయ శూన్యత ఏర్పడింది.
Also Read: దేశంలో మరో బ్యాంకు దివాలా..? మనీ విత్ డ్రాపై ఆంక్షలు
సహజంగానే, చాలా కాలంగా రాష్ట్రంపై దృష్టి సారించిన బిజెపికి ఇది అవకాశంగా మారింది. కేంద్ర హోంమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ రైట్ హ్యాండ్ అయిన అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అమిత్ షా ఈ పర్యటనలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవవచ్చని ప్రచారం సాగుతోంది.
ఇంతలో అందరి దృష్టి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.అళగిరిపైనే పడింది. అళగిరి కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు తెలిసింది. అళగిరి వెనుక బిజెపి హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ అలగిరికి మద్దతు ఇస్తుందని, ఆయన కోసం ఎత్తుగడలు వేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: భక్తులకు అలర్ట్.. కరోనా నెగటివ్ వస్తేనే పుష్కరాలకు అనుమతి..?
అళగిరి కొత్త రాజకీయ పార్టీ ప్రధానంగా ఆయన సోదరుడు, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ఓట్లను చీల్చడానికే అని అంటున్నారు.. అళగిరి మరియు స్టాలిన్ కరుణానిధి కుమారులు. అయినప్పటికీ, కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్‌కు ఓటు వేశారు. దీన్ని సహించలేని అళగిరి బయటకు వచ్చాడు. స్టాలిన్ డీఎంకేకి వ్యతిరేకంగా అళగిరి అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థులైన ఏఐడీఎంకే, బీజేపీలతో సహవాసానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అళిగిరిని రాజకీయంగా వాడుకునేందుకు ఏఐటీఎంకే, బీజేపీ డిసైడ్ అయినట్లు ప్రచారం సాగుతోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
స్టాలిన్ ను ఓడించడమే లక్ష్యంగా ఆయన అన్నతో బీజేపీ రాజకీయం మొదలుపెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.