జగన్ క్రిస్మస్ కానుక: ఏపీలో 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు

గద్దెనెక్కినప్పటి నుంచి ఒక్కో హామీని నెరవేరుస్తూ పోతున్న సీఎం జగన్ తాజాగా ఏపీ ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పారు. గత ఐదారు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. కొందరు కోర్టుకు ఎక్కడంతో బ్రేక్ పడ్డ ఇళ్ల స్థలాల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు.. దాదాపు ఐదారు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్రియకు మరోసారి […]

Written By: NARESH, Updated On : November 18, 2020 7:56 pm
Follow us on

గద్దెనెక్కినప్పటి నుంచి ఒక్కో హామీని నెరవేరుస్తూ పోతున్న సీఎం జగన్ తాజాగా ఏపీ ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పారు. గత ఐదారు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. కొందరు కోర్టుకు ఎక్కడంతో బ్రేక్ పడ్డ ఇళ్ల స్థలాల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు.. దాదాపు ఐదారు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్రియకు మరోసారి జగన్ ప్రభుత్వం తేదిని ఖరారు చేసి ఏపీ ప్రజలకు తీపికబురును అందించింది.

Also Read: నిమ్మగడ్డ రమేశ్ కు షాకిచ్చిన జగన్ సర్కార్

ఇప్పటికే జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 30,68,281 మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికీ క్రిస్మస్ రోజు పట్టాలు అందించడంతోపాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నారు.తొలి దశలో ఏకంగా 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25వ తేదిన క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రారంభం కానుంది. దీన్ని సీఎం జగన్ దగ్గరుండి ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులంతా ఆయా జిల్లాల్లో ప్రారంభిస్తారు. దీన్ని పెద్ద పండుగలా నిర్వహించాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు.

Also Read: భక్తులకు అలర్ట్.. కరోనా నెగటివ్ వస్తేనే పుష్కరాలకు అనుమతి..?

హైకోర్టులో స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 25న అర్హులకు డీ-ఫాం పట్టా ఇచ్చి ఇళ్ల స్థలం కేటాయించనున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్