https://oktelugu.com/

 Kolkata Doctor case : కోల్‌కత్తా డాక్టర్‌ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు.. పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లో ట్విస్ట్‌ ఇచ్చిన నిందితుడు!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కత్తాలోని ఆర్జీ కార్‌ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం, హత్య ఘటనలో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంజయ్‌ రాయ్‌కి పోలీసులు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించాడు. ఇందులో కలక విషయాలు వెల్లడించాడు. చివరకు ట్విస్ట్‌ ఇచ్చాడు. నేరం జరిగిన రోజున రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లినట్టు చెప్పుకొచ్చాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 26, 2024 / 09:09 PM IST

    Kolkata Doctor case

    Follow us on

    Kolkata Doctor case :దేశంలో సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకార్‌ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం, హత్య ఘటనపై విచారణ కొనసాగుతోంది. మొదట రాష్ట్ర పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు. తర్వాత కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. మూడు రోజుల క్రితం మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. మరోవైపు ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తోపాటు మరో ఆరుగురికి పాలిగ్రాఫ్‌ టెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. కోల్‌కతా కోర్టు ఇందుకు అనుమతి ఇవ్వడంతో శనివారం పాలిగ్రాఫ్‌ టెస్టు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్యతో నిర్వహించలేదు. కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతిలో సంజయ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వివరాలను వెల్లడించారు.

    ఘటన జరిగిన రోజు రాత్రి..

    – ఆగస్టు 8వ తేదీన రాత్రి నిందితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు.

    – రాత్రి 11:15 గంటలకు రాయ్ తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆస‍్పత్రి నుంచి బయటకు వెళ్లాడు.

    – బయట మద్యం సేవించి.. అనంతరం, నార్త్ కోల్‌కత్తాలోని సోనాగచీ రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లారు.

    – కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్ కోల్‌కతాలో ఉన్న చెట్లా రెడ్‌లైట్ ఏరియాకు చేరుకున్నారు.

    – అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు. నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు.

    – ఈ సందర్భంగా రాయ్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. తన నగ్న ఫొటోలను పంపాలని కోరాడు. దీంతో, ఆమె ఫొటోలను పంపించింది.

    – తర్వాత అదే వీధిలో ఓ మహిళను అతడు వేధింపులకు గురిచేశాడు.

    – కాసేపటి తర్వాత స్నేహితుడితో కలిసి ఆరీ‍్జకార్‌ ఆసుపత్రికి చేరుకున్నారు.

    తాను వెళ్లే సరికు చనిపోయి ఉంది…
    ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 4:03 గంటలకు ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు(సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం) ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్ లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి సంజయ్‌ రాయ్‌ను ప్రశ్నించారు. దీంతో, మాట మార్చిన నిందితుడు హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరేచోట ఉన్నట్టు చెప్పాడు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది.