https://oktelugu.com/

Megastar Vishwambhara : షూటింగ్ దశలోనే 120 కోట్లు..పాన్ ఇండియన్ సినిమాల క్రేజ్ ని దాటేసిన మెగాస్టార్ విశ్వంభర!

షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ సినిమాకి ప్రాంతాల వారీగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు పలుకుతున్నట్టు తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2024 / 08:59 PM IST

    Vishwambhara Movie crazy

    Follow us on

    Megastar Vishwambhara : ‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ‘విశ్వంభర’. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమా అంటే అభిమానులు మాత్రమే కాకుండా, ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూసేలా చేసిన చిత్రమిది. కాన్సెప్ట్ వీడియో తోనే అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాపై మార్కెట్ లో రోజురోజుకి క్రేజ్ పెరుగుతుంది. నేటి తరం స్టార్ హీరోల పాన్ ఇండియన్ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో, అలాంటి క్రేజ్ ఈ చిత్రంపై ఉన్నది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల కానుంది. చిరంజీవికి రీ ఎంట్రీ తర్వాత సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలు.

    అదే సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా కలిసి వస్తుందని మెగా అభిమానులతో పాటు ట్రేడ్ కూడా నమ్ముతుంది. అందుకే షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ సినిమాకి ప్రాంతాల వారీగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు పలుకుతున్నట్టు తెలుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఈ రేంజ్ లో ఉంటే, కర్ణాటక, ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓవర్సీస్ హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది సమాచారం. అలాగే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 10 కోట్ల రూపాయిలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 150 కోట్ల రూపాయిలు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ కి జరగబోతున్నట్టు తెలుస్తుంది. హనుమాన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాకి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అక్కడి బిజినెస్ టీజర్ తర్వాత ప్రారంభిస్తామని మేకర్స్ అంటున్నారట.

    ఒకవేళ టీజర్ కూడా క్లిక్ అయితే అన్నీ భాషలకు కలిపి కేవలం థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల రూపాయిలు జరుగుతుంది. ఇవి కాకుండా డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఇవన్నీ కలిపి మరో 200 కోట్లు, మొత్తం మీద ‘విశ్వంభర’ చిత్రానికి 400 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుందన్నమాట. 70 ఏళ్ళ వయస్సులో ఈ స్థాయి బిజినెస్ కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే జరుగుతుంది. అందుకే ఆయన తరంలో అందరూ నెంబర్ 1 హీరో అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఇషా చావ్లా, ఆషిక రంగనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.