Telangana Students Protest: తెలంగాణ సర్కారు ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ రిజల్ట్స్‌లో రెండు లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఈ విషయం ప్రజెంట్ తీవ్రచర్చనీయాంశంగా ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్తి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్రసర్కారు, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతోనే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని అంటున్నారు. సర్కారు నిర్లక్ష్యం వలన నల్లగొండకు చెందిన ఇంటర్ విద్యార్థిని జాహ్నవి, ఇందూరుకు చెందిన ధనుష్, భూపాలపల్లికి చెందిన వరుణ్
సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి సూసైడ్స్‌కు సర్కారు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్టూడెంట్స్ సూసైడ్స్‌కు సర్కారు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని అక్కడ ఆందోళనకు దిగారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యార్థులు ప్రిపేర్ అయ్యేంత వరకు టైం ఇవ్వకుండా ఏకపక్షంగా తీసుకున్న డెసిషన్స్ వల్లే ఇంటర్‌లో విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పాస్ చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరకు వారిని మోసం చేసిందని ఆరోపించారు.
Also Read: KCR on BJP : కేసీఆర్ సారు ఆదేశించడాలేనా..? పాటించడాల్లేవా??
తాము ఫెయిల్ అయ్యామనే బాధతో ఇప్పటికే ముగ్గురు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారని, సర్కారు వెంటనే స్పందించి బాధితుల కుటుంబీకులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నేతలు కోరుతున్నారు. ఈ విషయాలపై సర్కారు స్పందించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ క్రమంలోనే జూనియర్ కాలేజీలకు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇటీవల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆఫీసును విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకున్నారు. అయితే, ఆ క్రమంలోనే బషీర్ బాగ్ మినిస్టర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు ఇంకా తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు.
Also Read: Employee Separation Process: ఉద్యోగుల విభజన.. ప్రభుత్వ నిర్ణయంతో తర్జనభర్జన