https://oktelugu.com/

RRR: ‘ఆర్​ఆర్​ఆర్’ వచ్చాక ఓ 4 నెలలు ఏ సినిమా విడుదల చేయకుంటే బెటర్​- సల్మాన్

RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్ మేనియానే కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్ ఎన్టీఆర్​ హీరోలుగా కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మాణంతో వస్తోన్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాగా, ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ వచ్చిన కొద్ది గంటల్లోనే మిలియన్ల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 03:46 PM IST
    Follow us on

    RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్​ఆర్​ఆర్ మేనియానే కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్ ఎన్టీఆర్​ హీరోలుగా కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మాణంతో వస్తోన్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాగా, ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ వచ్చిన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్​లో ప్రభంజం సృష్టించింది. ఈ క్రమంలోనే రాజమౌళి తన స్ట్రాటజీతో ప్రమోషన్స్​ మొదలుపెట్టాడు.

    Karan Johar, Ram Charan, Salman Khan and Jr NTR

    తాజాగా, ముంబయి ఫిల్మ్​ సిటీ సమీపంలోని గురుకుల్​ మైదానంలో ఆర్​ఆర్​ఆర్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు. ఇందులో రాజమౌళి, చెర్రి, తారక్​లతో పాటు, కరణ్ జోహార్, అలియా భట్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయతే, ఈ వేడుకను లైవ్​ టెలికాస్ట్ చేయకపోయినా.. పలు ఆసక్తికర అప్​డేట్స్​ వస్తున్నాయి. కాగా, ఈ కార్యక్రమంలో సల్మాన్ భాయ్​ చెర్రీ, తారక్​లపై పొగడ్తల వర్షం కురిపించారట.

    Also Read: పుష్ప పరిస్థితి చూశాక, ఆర్ఆర్ఆర్ పై టెన్షన్ మొదలైంది !

    జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారట. చాలా సహజంగా నటిస్తారని.. ఇక రామ్​చరణ్​ను కలిసిన ప్రతి సారి ఏదో గాయంతో కనిపిస్తారని అన్నారు. షూటింగ్​లో ఉన్నప్పుడు తరచూ రామ్​చరణ్ గాయపడుతుంటారు. ఆయన పడే శ్రమ అలాంటింది. చరణ్ అసలు సిసలైన హార్డ్ వర్కర్​. అంటూ ఇద్దరు హీరోలపై ప్రశంసలు కురిపించాడట భాయ్​. మరోవైపు ఆర్​ఆర్​ఆర్​ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలైన తర్వాత ఓ 4 నెలల పాటు ఏ సినిమా విడుదల చేయకపోవడమే మంచిదని అన్నారు. దీంతోనే సినిమా ఏ రేంజ్​లో ఉండబోతోందో ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    Also Read: తన పేరుకు ముందున్న ఎస్​ఎస్​ అంటే అర్థం ఏంటో చెప్పిన రాజమౌళి