https://oktelugu.com/

Telangana State Debt: అప్పుల్లో తెలంగాణ కూడా ఏపీ దారిలోనేనా?

Telangana State Debt:  తెలంగాణలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్నా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా మారింది పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు దొందూ దొందే అన్న చందంగా మారాయి. ఉద్యోగులకు వేతనాలు సైతం సకాలంలోఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ మధ్య రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉద్యోగులకు వేతనాలు సరైన సమయానికి రావాలంటే […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 21, 2022 / 05:06 PM IST
    Follow us on

    Telangana State Debt:  తెలంగాణలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్నా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా మారింది పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు దొందూ దొందే అన్న చందంగా మారాయి. ఉద్యోగులకు వేతనాలు సైతం సకాలంలోఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ మధ్య రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉద్యోగులకు వేతనాలు సరైన సమయానికి రావాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చెప్పిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్వవస్థ కుదేలైపోతోదని తెలుస్తోంది. మరి ధనిక రాష్ట్రంలో డబ్బులకు ఎందుకు కొదవుందో అర్థం కావడం లేదు. మరోవైపు ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్నా వారు ఎప్పుడు కూడా తమది ధనిక రాష్ర్టమని చెప్పుకోలేదు. మన ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణ ధనిక రాష్ట్రమని కాగ్ చెబుతోందని ఆధారాలు చూపుతున్నారు. కానీ అసలు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    Telangana State Debt

    మరోవైపు తెలంగాణలో విద్యుత్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. దీంతో డిస్కంలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ ప్రజలకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా డిస్కంలకు చెల్లించేది మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో విద్యుత్ కష్టాలు సంస్థలకు గుదిబండలా మారాయి. దీంతో చేసేది లేక డిస్కంలుతలలు బాదుకుంటున్నాయి భవిష్యత్ లోకరెంటుకష్టాలు తప్పేలా లేవు, కానీ సీఎం మాత్రం విద్యుత్ సంస్థలను గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉన్నతాధికారులు సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. తమ గండం ఎలా గడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

    Also Read: CM Jagan: రాజ్యసభ సభ్యులుగా ఎవరికి అవకాశం ఇస్తారో

    ఎందుకు మన సీఎం ధనిక రాష్ట్రమని ఊదరగొడుతున్నాఎక్కడి అప్పులు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది, ఈ క్రమంలో తెలంగాణ రాష్టం కూడా అప్పుల్లో కూరుకుపోతోందని చెబుతున్నారు. ధనిక రాష్ట్రమైనప్పుడు అప్పులెలా ఉంటాయి కాగ్ చెప్పిన నివేదిక తప్పా మన ప్రభుత్వం చెబుతున్నది తప్పా ఇందులో దొంగలు ఎవరు అర్థం కావడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఆర్థిక స్థితిపై అందరికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారు అన్ని విషయాలు దాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని తెలుస్తోంది. ఇక తెలంగాణకు కూడా ఏపీకి పట్టిన గతే పడుతుదని విశ్లేషకులు భావిస్తున్నారు.

    రానురాను తెలంగాణ పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా మారుతోంది. భవిష్యత్ లో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు వంటి పథకాలు తేవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోందని చెబుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం పదే పదే చెబుతూ తెలంగాణ గురించి డాంబికాలు వల్లిస్తుంటే అందరికి అనుమానాలు పెరుగుతున్నాయి. రాబోయేకాలంలో తెలంగాణకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. మన ఆర్థిక వ్యవస్థలాగ మారితే ఇక శ్రీలంక సంక్షోభం మాదిరి మన దేశానికి కూడా ఎదురుదెబ్బలు తప్పవని చెబుతున్నారు.

    KCR

    అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం కేసీఆర్ ఇంకా ఎన్ని అభూత కల్పనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తారో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివాలాతీయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్ అగమ్యగోచరమేనని స్పష్టమవుతోంది. దీనికి కాగ్ సమాధానం చెబుతుందో మరి కేసీఆర్ ఇంకా ఏవైనా మాయలు చేస్తారో కూడా అంతుచిక్కడం లేదు.

    Also Read:AP high Court: మరోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..

    Tags