తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు ప్రత్యేక స్థానాన్ని చాటుకున్నారు. ఉద్యోగులంతా ఒక్కటై పోరాటం మొదలు పెట్టిన తరువాతే ఉద్యమంలో ఊపు వచ్చింది. వారంతా ఒక్కటై పెన్ డౌన్, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగ సంఘాలను పట్టించుకోవడం లేదని వారు చేస్తున్న ఆరోపణ. జీతాల విషయంలో సంత్రుప్తి పరిచినా తెలంగాణ రాకముందు నుంచి కోరుకుంటున్న పీఆర్సీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో వారు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: టీపీసీసీ రేసులో వెనుకబడ్డ రేవంత్.. కారణమెంటీ?
2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది. కొంత కాలం తరువాత ఆ హామీని మరిచిపోయింది. అయితే సమయం వచ్చినప్పుడల్లా పీఆర్సీలో కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. కానీ పీఆర్సీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో 2019 ఎన్నికల నుంచి ఉద్యోగులు కేసీఆర్ పై అసంత్రుప్తితో ఉన్నారు.
అయితే ఇటీవల వారి ఆందోళనను తీవ్రం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘం నేత బీజేపీ నాయకును కలవడంతో ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఉద్యోగులంతా ఒక్కటవుతున్నారు. అటు బీజేపీ నాయకులు సైతం ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకే పడ్డాయి. ఇక్కడ కూడా ఉద్యోగులు టీఆర్ఎప్ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది.
Also Read: కేసీఆర్, మోడీకి మళ్లీ విధేయుడవుతారా..?
తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలం పుంజుకుంటోంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ తన ప్రతాపం చూపించింది. రాను రాను ఒక వేళ పరిస్థితులు మారితే తమకు న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే ఉద్యోగుల సంఘం మాజీ నేత స్వామి గౌడ్ బీజేపీలోకి చేరారు. దీంతో ఆయన అనునాయులు కమలం వైపు చూస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్