Governor Tamilisai: అది న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులతో సిద్ధంగా విమానం ఉంది. అనౌన్స్మెంట్ అవడంతో టేక్ ఆఫ్ అయింది. కానీ ఇంతలోనే ఎయిర్ హోస్టెస్ అరుపులు, కేకలు. ప్రయాణికుల్లో ఒకటే ఆందోళన.. ఒక ప్రయాణికుడు చెమటలు కక్కుతూ విలవిల్లాడుతున్నాడు. ” మీలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఇక్కడ ఒక ప్రయాణికుడు చాతి నొప్పితో బాధపడుతున్నాడు. మీరు ఏమైనా వైద్య చికిత్స చేయగలరా” అంటూ ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేయడంతో.. ఓ మహిళ లేచి అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో అతడికి సాంత్వన కలిగించింది. వెంటనే ప్రధమ చికిత్స చేసి మందులు అందించింది. తీరా ఫ్లైట్ దిగాక అతడిని హాస్పిటల్ పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. నొప్పితో బాధపడుతున్న అతడికి ప్రథమ చికిత్స చేసింది. మరెవరో కాదు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర రాజన్.
గవర్నరే కాదు వైద్యురాలు కూడా..
తమిళ సై స్వస్థలం తమిళనాడు. ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు. వైద్య విద్యలో ఉండగానే ఆమె ఏబీవీపీ చెన్నై నగర అధ్యక్షురాలిగా పనిచేశారు. వైద్య విద్యార్థుల సమస్యలపై ఎలుగెత్తి పోరాడారు. ముఖ్యమంత్రి కరుణానిధిని నేరుగా ప్రశ్నించిన తెగు ఆమె సొంతం. పేరులోనే ధీరత్వం ఉంది కాబట్టే ఎలాంటి సమస్యకైనా ఎదురొడ్డే రకం తమిళ సై ది. వరుస ఓటములు ఎదురైనా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమెకు తెలంగాణ గవర్నర్గా అవకాశమిచ్చింది. నరసింహన్ తర్వాత గవర్నర్గా వచ్చిన ఆమె అనతి కాలంలోనే ప్రజల మనిషి అనిపించుకున్నారు.
Also Read: Anasuya Bharadwaj: మూడు రోజులు టైం ఇవ్వవా? అనసూయపై చలాకీ చంటీ హాట్ కామెంట్స్..
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో
తమిళసై వృత్తిరీత్యా వైద్యురాలు కావడంతో రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలోని అటవీ గ్రామాల్లో ఆదివాసులకు నాణ్యమైన పౌష్టికాహారం, మహిళల్లో రక్తహీనతను నివారించేందుకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలంలో ఆదివాసీలకు వనరాజా నాటు కోళ్లను పంపిణీ చేశారు. ఈ యూనిట్ల ద్వారా అక్కడి ఆదివాసీలు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. దమ్మపేట మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రంలోని ఆదివాసి గ్రామాల్లో అమలు చేయాలని యోచిస్తున్నారు. పైగా ఇటీవల ఆమె దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లతో వైద్య శిబిరాలు నిర్వహించారు. తాను కూడా స్యయంగా ఆదివాసి మహిళలను పరీక్షించారు. చిన్న వయసులో పెళ్లి కావడంతో చాలామంది ఆదివాసి యువతులు రక్తహీనతతో బాధపడుతుండటాన్ని ఆమె గమనించారు. దాని నివారణ కోసం రెడ్ క్రాస్ సహకారంతో ఏకంగా పౌష్టికాహార కిట్లు తయారుచేసి ఇస్తున్నారు.
పైగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కుట్టుమిషన్లు, పుట్టగొడుగుల యూనిట్లు అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆదివాసి గ్రామాల్లో బాల్య వివాహాలు ఎక్కువ గనక కళాజాతాల ద్వారా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రక్తహీనతను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఆహారమే కాకుండా నాణ్యమైన విద్య అందించేందుకు ఆదివాసి పిల్లలకు నోటు పుస్తకాలు, పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు నివారించేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలానికి చెందిన సీనియర్ డాక్టర్ పిన్నింటి రాజశేఖర్ ను ఈ బృందానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ఈ డాక్టర్కు ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడిగా పేరు ఉంది. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలో పిల్లల్లో తలెత్తే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్ ఏకంగా ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దమ్మపేటలో మారుమూల ఆదివాసి గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి, అందులో వివిధ లోపాలతో బాధపడుతున్న చిన్నారులను ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
తాజాగా ఫ్లైట్లో ప్రయాణికుడికి అప్పటికప్పుడు ప్రధమ చికిత్స అందించి అతడి ప్రాణాన్ని కాపాడిన తమిళసై సౌందర్య వైద్య నిరతిని చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఒక తోటి ప్రయాణికుడి ప్రాణాన్ని కాపాడారని పొగుడుతున్నారు.
Also Read:Modern Love Hyderabad Review: రివ్యూ : మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్