Telangana Election Results 2023: ఆనవాయితీని బ్రేక్ చేసిన కాంగ్రెస్

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. నాలుగు దశాబ్దాలుగా విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా కాంగ్రెస్ పార్టీ ఎదురుచూసింది. గత పది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు.

Written By: Dharma, Updated On : December 3, 2023 3:52 pm

Telangana Election Results 2023:

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఎన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి.అసలు విజయమే దక్కని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం, కాకలు తీరిన సీనియర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన యువ నాయకులు మట్టి కల్పించడం వంటివి వెలుగు చూశాయి. చాలా రకాలుగా రికార్డులు సైతం బద్దలయ్యాయి.

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. నాలుగు దశాబ్దాలుగా విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా కాంగ్రెస్ పార్టీ ఎదురుచూసింది. గత పది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచి రికార్డ్ సృష్టించింది. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనవిజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి పై 25,761 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనిల్ గెలుపుతో భువనగిరి కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మిన్నంటాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిసారిగా ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ లో కుందూరు జై వీర్ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తి లో మందుల సామెల్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త అభ్యర్థులను బరిలో దించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గెలుపు బాట పట్టింది. సిట్టింగ్ లకే టిక్కెట్లు ఇచ్చి బీఆర్ఎస్ చేతులు కాల్చుకుంది.