https://oktelugu.com/

Ileana: ఇలియానా సినీ పరిశ్రమకు దూరం కానుందా..? అదే కారణమా

టాలీవుడ్ లోని దాదాపు అందరి హీరోలతో నటించిన గోవా బ్యూటీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 3, 2023 / 03:50 PM IST

    Ileana

    Follow us on

    Ileana: ఇలియానా.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నటీమణి. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్లారు. పోకిరి, కిక్ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఇలియానా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

    టాలీవుడ్ లోని దాదాపు అందరి హీరోలతో నటించిన గోవా బ్యూటీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చారు. రవితేజతో కలిసి నటించిన ఈ సినిమా విజయాన్ని సాధించకపోవడంతో మళ్లీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా దూరం కానున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఆమె నటనకు పూర్తిగా గుడ్ బై చెప్తారని, విదేశాలకు వెళ్లిపోతారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

    ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడిన ఇలియానా కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. తరువాత కొన్ని కారణాలతో బ్రేకప్ కావడం జరిగిపోయాయి.. అయితే తాజాగా ఇలియానా గర్భవతినంటూ పెట్టిన పోస్ట్ అప్పటిలో వైరల్ గా మారింది. ఆ తరువాత తన భర్త మిచెల్ డోలెన్ ను ఇలియానా అభిమానులకు పరిచయం చేసింది.

    ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తున్న ఇలియానా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. భర్త, కుమారుడితో కలిసి యూఎస్ లో సెటిల్ కావాలని ఆమె నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సినిమాల్లో సరైన అవకాశాలు లేకపోవడంతో పాటు తనకు నటనపై ఆసక్తి లేదని తెలుస్తోంది. ఈ క్రమలోనే ఆమె విదేశాల్లో సెటిల్ కావాలని భావిస్తున్నారట. అయితే దీనిపై ఇలియానా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదీ ఏమైనా గోవా బ్యూటీ సినిమాలకు దూరంగా వెళ్లానున్నారనే వార్త ఆమె అభిమానుల్లో కాస్త బాధను మిగిల్సిందనే చెప్పొచ్చు.