CM KCR – Paddy Issue: తెలంగాణలో ప్రస్తుతం వరిధాన్యంపైనే రాజకీయం నడుస్తోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోరాటం మొదలు పెట్టాయి. దీంతో ధాన్యం కొనుగోలుపై రైతులకు ఆందోళన నెలకొంది. తమ ధాన్యం కొంటారా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో దీక్ష చేపట్టిన కేసీఆర్ కేంద్రానికి ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించారు. దీంతో పరిస్థితి సై అంటే సై అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలో రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు గండం పట్టుకుంది.

ధాన్యం కొనుగోలులో ఏ నిర్ణయం తీసుకున్నా అది బీజేపీకి, కాంగ్రెస్ కు లాభం చేకూర్చకుండా చేయాలనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రెండు పార్టీలకు గుణపాఠం చెప్పే విధంగా తరుణోపాయం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తమ పోరాటాలతోనే టీఆర్ఎస్ దిగొచ్చినట్లు చెప్పుకునే అవకాశాలు లేకపోలేదు. అందుకే వాటికి అవకాశం ఇవ్వకుండా చేయాలనే నిర్ణయంతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read: CM KCR: కేసీఆర్ అబద్దాల్లో గిన్నిస్ రికార్డే బద్దలు కొడతారా?
ఏ పార్టీకి కూడా చాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారనే విషయం తేటతెల్లమవుతోంది. ధాన్యం కొనుగోలులో రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కవు. అర్థం కాకుండా ఉంటాయనే వాదన కూడా ఉంది. దీంతోనే బీజేపీ, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా ఆలోచిస్తున్నారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానం ఏ రాష్ట్రం కూడా అవలంభించకుండా చేయడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని కేసీఆర్ పథక రచనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో పార్టీకి మంచి పేరు తెచ్చేలా చూస్తున్నారనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని నిందిస్తూనే రైతులకు మేలు చేసే విధంగా కేసీఆర్ బృహత్తర ప్రణాళిక రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read:Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కోర్టు శిక్ష విధిస్తుందా?
[…] Gautam Adani: తాడి దన్నే వాడి తలదన్నే వాడుంటాడంటారు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయని తెలిసిందే. ఇన్నాళ్లు దేశంలోనే అత్యంత సంపన్నుడెవరంటే ఠక్కున సమాధానం చెప్పేవారు ముఖేష్ అంబానీ అని. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన స్థానాన్ని మరో వ్యక్తి ఆక్రమించాడు. ఆయనే గౌతమ్ అదానీ. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్న ముఖేష్ అంబానీ మరో అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం ఏర్పడింది. […]