https://oktelugu.com/

Katrina Kaif: తల్లిని చేశారు సరే.. మరి సినిమాల మాటేమిటి ?

Katrina Kaif: బాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ తల్లి కాబోతుందని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కత్రీనా కైఫ్‌ గతేడాది పెళ్ళి చేసుకొంది. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుంచి తన భర్త విక్కీతో ముంబైలోనే కాపురం పెట్టింది. మరి ఈ 38 ఏళ్ల క్రేజీ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే వార్త బాగా వైరల్ అవుతుంది గానీ, ఇప్పటి వరకు […]

Written By:
  • Shiva
  • , Updated On : April 12, 2022 / 06:19 PM IST
    Follow us on

    Katrina Kaif: బాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ తల్లి కాబోతుందని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కత్రీనా కైఫ్‌ గతేడాది పెళ్ళి చేసుకొంది. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుంచి తన భర్త విక్కీతో ముంబైలోనే కాపురం పెట్టింది.

    Katrina Kaif

    మరి ఈ 38 ఏళ్ల క్రేజీ హీరోయిన్ తల్లి కాబోతుంది అనే వార్త బాగా వైరల్ అవుతుంది గానీ, ఇప్పటి వరకు అయితే కత్రీనా కైఫ్‌ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయాన్ని ఈ జంట కలిసి అధికారికంగా ప్రకటిస్తారనే టాక్ నడుస్తోంది. కేవలం తాను తల్లి కాబోతున్న సందర్భంగా ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని కత్రీనా కైఫ్‌ ప్లాన్ చేసుకుంటుందట.

    Also Read: Tollywood Trends: నేటి వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    అసలు ఇంతకీ కత్రీనా కైఫ్ తల్లి కాబోతుంది అనే వార్త ఎలా పుట్టుకొచ్చింది అంటే.. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్‌పోర్టులో కనిపించిన లుక్ సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆ వీడియోలో ఆమె ఉదర భాగం ఎత్తుగా కనిపిచింది. దాంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడం వల్ల కత్రీనా ప్రెగ్నెంట్‌ అయిందని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కత్రీనా కైఫ్‌ తన వివాహ బంధంలో మునిగితేలుతుంది.

    మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా గ్లామర్ హీరోయిన్ గా నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న కత్రీనా కైఫ్‌ కి వయసు పై పడటంతో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. అయినా సరే, ఫుల్ కాంపిటీషన్ లో వరుస ఛాన్స్ లను అందుకోవడానికి మరింత గ్లామర్ గా రెడీ అయి ఛాన్స్ ల కోసం తెగ తాపత్రయ పడుతుంది.

    Katrina Kaif

    ఈ క్రమంలో సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ ముందుకు పోతుంది కత్రీనా కైఫ్‌. ఆ అందిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలు చేస్తోంది. మరి ఇప్పుడు తల్లి కాబోతుంది కాబట్టి ఇక సినిమాలకు గ్యాప్ ఇస్తోందేమో చూడాలి. అయితే ప్రస్తుతం కత్రీనా కైఫ్‌ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకవేళ ఆమె తల్లి కాబోతుంది అనేది నిజం అయితే.. మూడు నెలల లోపు ఈ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

    Also Read:Ram Charan: చరణ్.. ఈ రోజు ఫైటింగ్, రేపటి నుంచి రొమాన్స్

    Tags